జాతీయ వార్తలు

కాంగ్రెస్ నేత ఫోతేదార్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి మఖన్ లాల్ ఫోతేదార్ గురువారం కన్నుమూశారు. మాజీ ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు విశ్వాసపాత్రుడయిన ఫోతేదార్ ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో గల ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. కాశ్మీర్‌కు చెందిన ఫోతేదార్ 1950వ దశాబ్దం తొలినాళ్లలో జవహర్ లాల్ నెహ్రూ ప్రోత్సాహంతో రాజకీయాలలోకి ప్రవేశించారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన పార్టీలోని అత్యంత బలమైన నాయకులలో ఒకరిగా ఆవిర్భవించారు. ఇందిరాగాంధీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా మారిన ఫోతేదార్ 1980లో ఆమెకు రాజకీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్‌గాంధీ కూడా మూడు సంవత్సరాల పాటు ఫోతేదార్‌ను తన రాజకీయ కార్యదర్శిగా నియమించుకున్నారు. పార్టీలో అత్యంత ఉన్నత స్థాయి నిర్ణాయక సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)లో ఫోతేదార్ చాలాకాలం పాటు సభ్యుడిగా పనిచేశారు. చనిపోయేంత వరకు కూడా ఆయన సిడబ్ల్యుసిలో శాశ్వత ఆహ్వానితుడిగా కొనసాగారు.
ఫోతేదార్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. అయిదు దశాబ్దాలకు పైగా కాలం పాటు రాజకీయాలలో క్రియాశీలకంగా పనిచేసిన ఫోతేదార్ ప్రజల హక్కుల కోసం అవిశ్రాంతంగా పాటుపడ్డారని ఆమె తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఫోతేదార్ కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకుల్లో ఒకరిగా కొనసాగారని, పార్టీకి ఆయన లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. ఫోతేదార్ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో కూడా కొంతకాలం సభ్యుడిగా ఉన్నారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.