జాతీయ వార్తలు

చట్నీలో ఎలుక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: విద్యాసంస్థల వసతి గృహల్లో ఆహారం కలుషితం కావడం, ఫుడ్ పాయిజనింగ్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురికావడం తరచూ వింటూనే ఉంటాం. అయితే దేశ రాజధాని ఢిల్లీలోని ఓ వసతి గృహంలో తయారుచేసిన చట్నీలో చనిపోయిన ఎలుక దర్శనం ఇవ్వడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన జరిగింది ఏదో మామూలు వసతి గృహంలో కాదు. ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (్ఢల్లీ ఐఐటి) క్యాంపస్‌లో. ఢిల్లీ ఐఐటి క్యాంపస్‌లో 11 బాలుర వసతి గృహాలు, మూడు బాలికల వసతి గృహాలు ఉన్నాయి. వాటిలో ఒకటయిన ఆరావళి వసతి గృహంలో మంగళవారం ఓ విద్యార్థి తనకు సర్వ్ చేసిన అల్పాహారం చట్నీలో చనిపోయిన ఎలుక ఉండడం చూసి వెంటనే ఆ విషయాన్ని విద్యార్థుల వ్యవహారాలు చూసే డీన్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆయన ఈ సంఘటనపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ విద్యార్థి ఈ సంఘటనను తన ఫేస్‌బుక్ ఖాతాలో కూడా వివరించాడు. ‘ఈ రోజు ఐఐటిలోని ఒక హాస్టల్‌లో చట్నీలో చనిపోయిన ఎలుక కనిపించింది. ఎలుకలు ఎన్ని రకాల వైరస్‌లు, జబ్బులను వ్యాప్తి చేస్తాయో గుర్తుకు వచ్చి భయమేస్తోంది. దీనికి బదులు ఎలుకతో చేసిన చట్నీయే తింటే బాగుంటుందేమో’ అని ఆ విద్యార్థి ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు. హాస్టళ్లలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఈ విషయాన్ని మిగతా వాళ్లతో పంచుకోవాలని ఆ విద్యార్థి తోటివారిని కోరాడు. చదువుల ఒత్తిడితోపాటుగా ఫుడ్ పాయిజనింగ్, డెంగ్యూ, మలేరియా, కలరా లాంటి ప్రాణాంతక వ్యాధుల భయంతో తాము జీవిస్తున్నామని కూడా ఆ ట్వీట్‌లో విద్యార్థి పేర్కొన్నాడు.