జాతీయ వార్తలు

పేరు మార్చే రోజునే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్ఫిన్ స్టోన్ స్టేషన్ పేరును మార్చే రోజునే తొక్కిసలాట ఘటన జరగడం గమనార్హం. ముందు నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఈ స్టేషన్ పేరును ప్రభాదేవి స్టేషన్‌గా పేరు మార్చాల్సి ఉండింది. బ్రిటీష్ పాలనలో ఈ ప్రాంతాన్ని పాలించిన గవర్నర్ ఎల్విన్‌స్టోన్ గౌరవార్థం అప్పట్లో ఈ స్టేషన్‌కు ఆయన పేరు పెట్టారు. అయితే స్థానికంగా ఉన్న సుప్రసిద్ధ ప్రభామాత దేవి పేరును ఈ స్టేషన్‌కు పెట్టాలని గతంలో శివసేన ప్రతిపాదించింది. అసెంబ్లీలో దీనిపై చర్చ కూడా జరిగింది. చివరికి గత ఏడాది డిసెంబర్‌లో పేరు మార్చేందుకు అసెంబ్లీ తీర్మానం చేసింది. శుక్రవారం అధికారికంగా ఈ స్టేషన్ పేరును ప్రభాదేవి స్టేషన్‌గా మార్చాల్సి ఉండగా అదే రోజు తొక్కిసలాట ఘటన జరగడం యాదృచ్చికం.

చిత్రం..బ్రిడ్జిపైనే ప్రయాణికుల పాదాల కింద శవాల కుప్ప