జాతీయ వార్తలు

నలిగిపోయారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 29: దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. స్థానిక ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే స్టేషన్‌లోని ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై జరిగిన తొక్కిసలాటలో 22 మంది మృత్యువాతపడ్డారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దసరా పండుగ రోజున జరిగిన దుర్ఘటన పలువురిని విషాదంలో ముంచివేసింది. ఈ రైల్వే స్టేషన్‌లో లోకల్ రైళ్లు ఎక్కువగా ఆగుతుంటాయి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో అనేక కార్పొరేట్ కార్యాలయాలు, పత్రికాఫీసులు కూడా ఉండటంతో ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. నిత్యం లక్షలాది మంది ఫుట్‌ఓవర్ బ్రిడ్జి మీదుగా ప్రయాణిస్తుంటారు. శుక్రవారం ఉదయం పదిన్నర గంటల సమయంలోనూ స్టేషన్ జనంతో కిటకిటలాడుతూ ఉంది. నాలుగు లోకల్ రైళ్లు ఒకేసారి రావడంతో జనం ఒక్కసారిగా బయటకు వెళ్లడానికి ప్రయత్నించారు. అదే సమయంలో కుండపోత వర్షం కూడా కురుస్తోంది. వర్షంనుంచి తప్పించుకోవడం కోసం జనం ఇరుగ్గా ఉండే ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై తలదాచుకోవడానికి ప్రయత్నించారు. అయితే రైలు దిగిన వాళ్లు వర్షం ఆగగానే ఒక్కసారిగా బయటకు వెళ్లడానికి రావడం, బ్రిడ్జిపై ఆగిపోయిన జనం దిగడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరింది. అదే సమయంలో బ్రిడ్జికి దగ్గరనుంచి భారీ శబ్దం కూడా వినిపించింది. షార్ట్ సర్క్యూట్ జరిగిందని కొందరు, బ్రిడ్జి కూలిపోయిందంటూ మరికొందరు గట్టిగా కేకలు వేయడంతో అందరూ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టారు. అయితే వర్షం కారణంగా బ్రిడ్జి మెట్లు జారుడుగా మారడం కూడా ప్రాణనష్టం ఎక్కువగా ఉండడానికి కారణమైందని పోలీసు, రైల్వే అధికారులు చెప్తున్నారు. కొంతమంది కిందపడిపోగా, వారిపై మరి కొందరు పడిపోవడంతో ఊపిరాడక చాలామంది చనిపోయారు. మరికొంతమంది స్పృహతప్పి పోయారు. ప్రాణాలను కాపాడుకోవడానికి కొంతమంది బ్రిడ్జి కడ్డీలపైనుంచి దిగడానికి ప్రయత్నించి
పడిపోయి గాయపడ్డారు. కింద ఉన్న జనం తమ కళ్ల ముందే ఇదంతా జరిగినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. కొంతమంది మాత్రం స్పహతప్పిపోయిన వారికి ప్రథమ చికిత్స అందించారు. ‘్భరీ వర్షం వచ్చింది. రైళ్లు దిగిన జనమంతా స్టేషన్‌లోనే ఆగిపోయారు. వర్షం ఆగగానే ఒక్కసారిగా జనం బైటికి వెళ్లడానికి ప్రయత్నించడంతో గందరగోళం తలెత్తింది’ అని పశ్చిమ రైల్వే ప్రతినిధి అనిల్ సక్సేనా చెప్పారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జికి దగ్గర్లో పెద్ద శబ్ధంతో షార్ట్ సర్క్యూట్ జరగడంతో జనం భయంతో పరుగులు పెట్టడమే తొక్కిసలాటకు దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతిచెందిన వారిలో ఎనిమిది మంది మహిళలు, బాలుడు ఉన్నారు. గాయపడిన వారిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉందని బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ విపత్తుల నిర్వహణ విభాగం చీఫ్ మహేష్ సర్వేకర్ చెప్పారు.
రూ.10 లక్షల సాయం
కాగా, శుక్రవారం నగరంలో మరిన్ని సబర్బన్ రైలు సర్వీసులు ప్రారంభించడం కోసం నగరానికి వచ్చిన రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకున్నారు. సంఘటనపై పశ్చిమ రైల్వే చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, స్వల్ప గాయాలయిన వారికి రూ. 50 వేల తక్షణ సాయాన్ని ప్రకటించారు. కాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రుల వైద్యానికి అయ్యే ఖర్చునంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
రాష్టప్రతి, ప్రధాని దిగ్భ్రాంతి
ముంబయి తొక్కిసలాట ఘటనపై రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తొక్కిసలాట కారణంగా భారీ సంఖ్యలో ప్రాంలు కోల్పోవడం విచారకరం, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని రాష్టప్రతి ఒక ట్విట్టర్‌లో అన్నారు. కాగా, ముంబయి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ పరిస్థితిని తెలుసుకోవడానికి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సంఘటన స్థలానికి చేరుకొన్నారని, కేంద్రం తరఫున ఏ సహాయమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇదిలా ఉండగా కెఇఎం ఆస్పత్రిలో చేర్చిన క్షతగాత్రులకు రక్తం అవసరమైనందున రక్తదానం చేయాలంటూ ముంబయి పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

చిత్రం..సంఘటనా స్థలి వద్ద రైల్వేమంత్రి పీయూష్ గోయల్