జాతీయ వార్తలు

జైట్లీవి చౌకబారు వ్యాఖ్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు చౌకబారుగా ఉన్నాయని బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా శుక్రవారం విమర్శించారు. అంతేకాదు తన పనిని జైట్లీ విమర్శించడమంటే తనకు కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలను అప్పగించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయిని విమర్శించడమే అవుతుందని ఆయన అన్నారు. ఎనభై ఏళ్ల వయసులో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొంటున్నానంటూ తన గురించి జైట్లీ చేసిన వ్యాఖ్యలపై సిన్హా తీవ్రంగా స్పందిస్తూ ఆయన పార్టీ సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీని దారుణంగా అవమానించడమేనని, ఎందుకంటే కేవలం అంశాలకే పరిమితం కావాలే తప్ప వ్యక్తిగత విమర్శలకు దిగవద్దంటూ అద్వానీ ఇచ్చిన సలహాను మొదట ఉదహరించారని అన్నారు. ‘జైట్లీ వ్యాఖ్య ఎంత చౌకబారుగా ఉందంటే దానికి స్పందించడం నా గౌరవాన్ని దిగజార్చుకోవడమే అవుతుందని భావిస్తున్నాను’ అని సిన్హా పిటిఐతో అన్నారు. మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను విమర్శిస్తూ యశ్వంత్ సిన్హా ఇటీవల ఓ జాతీయ దినపత్రికలో రాసిన వ్యాసం పెద్ద దుమారానే్న రేపిన విషయం తెలిసిందే.
అనంతరం ఆయన రాజకీయాల్లో చేరడం కోసం తాను రిటైర్మెంట్‌కు 12 ఏళ్ల ముందే ఐఏఎస్ పదవిని వదిలిపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు, తాను గెలవడం ఖాయమని తెలిసినా 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని స్వచ్ఛందంగా నిర్ణయించుకొన్నానని, ఎందుకంటే ఎన్నికల రాజకీయాలనుంచి వైదొలగాలని అప్పటికే నిర్ణయించుకున్నానని సిన్హా చెప్పారు. ఇప్పుడు మీరు ఎన్నికల్లో పోటీ చేయరా అని అడగ్గా లేదని ఆయన స్పష్టం చేశారు. ‘జైట్లీ నా గత చరిత్రను పూర్తిగా మరిచిపోయినట్లు కనిపిస్తోంది. ఒక వేళ నేను పదవికోసం చూస్తూ ఉండి ఉంటే వీటన్నిటినీ వదులుకొని ఉండే వాడిని కాదు’ అని సిన్హా స్పష్టం చేశారు.
వాజపేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా తన పని తీరును విమర్శించిన జైట్లీ, ఇతర బిజెపి నేతలపై సిన్హా ఎదురుదాడి చేస్తూ, తన సామర్థ్యాన్ని గుర్తించే మరింత కీలకమైన విదేశాంగ మంత్రిత్వ శాఖను తనకు అప్పగించారని, భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీలో చురుకైన సభ్యుడిగా కూడా ఉన్నానని ఆయన తెలిపారు. 2002 జూలైలో తాను విదేశాంగ మంత్రి బాధ్యతలు చేపట్టిన ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉండిందని, 2001 డిసెంబర్‌లో పార్లమెంటుపై దాడి తర్వాత సరిహద్దులో భారత్, పాక్ సైన్యాలు ఎదురెదురుగా మోహరించి ఉన్నాయని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం అటల్‌బిహారీ వాజపేయిని భారత రత్నతో సత్కరించి ఎంతో గౌరవించిందని, అయితే తనను మాత్రం విమర్శిస్తోందన్నారు. తాను అయిదు రెగ్యులర్, రెండు మధ్యంతర కేంద్ర బడ్జెట్‌లను సమర్పించినట్లు చెప్పారు.