జాతీయ వార్తలు

జిఎస్టీ శ్లాబుల కుదింపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫరీదాబాద్, అక్టోబర్ 1: ప్రభుత్వానికి రాబడి పెరిగితే వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) శ్లాబులను కుదించే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సూచనప్రాయంగా వెల్లడించారు. ఫరీదాబాద్‌లో ఆదివారం ఎన్‌ఎసిఐఎన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘దేశంలో మూడు నెలల క్రితమే జిఎస్‌టి అమలు ప్రారంభమైంది. దీనికి మరిన్ని మెరుగులు దిద్దుకునేందుకు, చిన్నచిన్న పన్ను చెల్లింపుదారులపై భారాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వానికి రాబడులు పెరిగి ఆదాయం తటస్థ స్థితికి చేరుకుంటే జిఎస్‌టి శ్లాబులు కుదించటంలాంటి పెద్ద సంస్కరణల గురించి మనం ఆలోచించవచ్చు. ఆదాయం తటస్థ స్థితికి చేరుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం వస్తు, సేవల పన్ను రేట్లను నాలుగు శ్లాబులు (5, 12, 18, 28 శాతం)గా విభజించిన ప్రభుత్వం, దీనికి అదనంగా కొన్ని వస్తువులపై జిఎస్‌టి పరిహార సెస్సును కూడా విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు, ప్రత్యేకించి సామాన్య ప్రజలు విరివిగా ఉపయోగించే వస్తువులపై పన్ను రేట్లను తగ్గించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుందని, ప్రస్తుతానికి మాత్రం పరోక్ష పన్నుల భారాన్ని సమాజంలోని అన్ని వర్గాల వారు భరించాల్సిందేనని జైట్లీ తేల్చిచెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ప్రజలపై పన్నుల భారం పెద్దగా ఉండదని, అయితే అభివృద్ధి కోసం డిమాండ్ చేసే హక్కు ప్రజలకు ఉన్నప్పుడు ఆ అభివృద్ధికి అవసరమైన సొమ్మును చెల్లించే బాధ్యత కూడా వారికి ఉంటుందని ఆయన అన్నారు. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) 67వ బ్యాచ్ అధికారులను ఉద్ధేశించి జైట్లీ ప్రసంగిస్తూ, దేశంలో పరిపాలనతో పాటు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు రెవెన్యూ విభాగమే ‘ఆయువుపట్టు’ లాంటిదన్నారు.

చిత్రం..నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ సెమినార్‌లో ఆర్థిక మంత్రి జైట్లీ