జాతీయ వార్తలు

దేశ భద్రతకు ఢోకాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అన్ని కులాలు, మతాలకు చెందిన ప్రజలు తమ శక్తియుక్తులను కూడదీసుకొని ఉగ్రవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతారని ఆయన పేర్కొన్నారు. శనివారం ఇక్కడ జరిగిన అంతర్జాతీయ బుద్ధ పూర్ణిమ దినోత్సవంలో రాజ్‌నాథ్‌తో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడిగా విలేఖరులతో మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్‌ను కాశ్మీర్ అంశం, బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్, ముజఫర్‌నగర్‌లలో మత ఘర్షణలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ ఒక వీడియోలో హెచ్చరించినట్లు వచ్చిన వార్తలపై ఒక విలేఖరి ప్రశ్నించగా ‘ఈ దేశ రక్షణకు ఏయే చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందో ఆయా చర్యలన్నింటిని మేము తీసుకుంటున్నాం’ అని బదులిచ్చారు. ఉగ్రవాద సంస్థలు తమ ప్రచారం కోసం విడుదల చేసే ఇలాంటి వీడియోలు ఈ దేశ ప్రజలను ఏమాత్రం ప్రభావితం చేయబోవని కిరెన్ రిజిజు అన్నారు. దేశంలో ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలను అనుమతించబోమని భారత ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు బుద్ధపూర్ణిమ దినోత్సవంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ‘ఈ రోజుల్లో వ్యక్తుల మధ్య, సమాజాల మధ్య, మతాల మధ్య వైరుధ్యాలు పెరుగుతున్నాయి. ఈ సంక్షోభాలకు పరిష్కారాలు బుద్ధుడి సందేశాల్లో ఉన్నాయి’ అని అన్నారు. ఉగ్రవాదానికి, తీవ్రవాదానికి కూడా పరిష్కారాలు బుద్ధుడి సందేశాల్లో ఉన్నాయని ఆయన వివరించారు. అందరు అహింసను విశ్వసించడం ప్రారంభిస్తే హింసాత్మక సంఘటనల సంఖ్య ఎలా పెరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఏ మతానికి కూడా మరో మతంతో వైరుధ్యం లేదని, అయితే అన్ని మతాలు ఒకదానినొకటి పరిపూరకం చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. అయితే కొన్ని వేర్పాటువాద శక్తులు మతాల మధ్య చీలికలు, స్పర్థలు తేవడానికి ప్రయత్నిస్తున్న విషయం తనకు తెలుసని ఆయన అన్నారు. హిందూమతం ప్రకారం గౌతమ బుద్ధుడు మహా విష్ణువు తొమ్మిదో అవతారమని, అందుకే బుద్ధుడి జన్మదినం ఆయన భక్తులకే కాకుండా హిందువులకు కూడా ఎంతో ముఖ్యమైనదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.