జాతీయ వార్తలు

టాయ్‌లెట్ కోసం.. మామపై కోడలు కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, అక్టోబర్ 1: అత్తవారింటికి వచ్చిన ఓ కోడలు ఆ ఇంట్లో బహిర్భూమి (టాయ్‌లెట్) లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురైంది. ఇదే విషయమై తన కుటుంబ సభ్యులకు, మామ, మరిదికి ఎన్నోసార్లు విన్నవించింది. ఆమె భర్త పనిమీద తమిళనాడు వెళ్లడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త తిరిగి వచ్చినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఇక చేసేది లేక తిన్నగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి మామ, మరిదిపై కేసు పెట్టింది. బిహార్‌లోని ముజాఫర్ జిల్లాలో సెప్టెంబర్ 25న ఈ సంఘటన జరిగింది. మరుసటి రోజే పోలీసులు మామ, మరిదిని పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించారు. కోడలు డిమాండ్ మేరకు త్వరలోనే టాయ్‌లెట్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనపై ముజఫరాబాద్ మహిళా పోలీసు స్టేషన్ అధికారి జ్యోతి మాట్లాడుతూ, ‘వారం రోజుల్లో టాయ్‌లెట్ ఏర్పాటు చేయాలని వారిని కోరాం, అయితే డబ్బు సర్దుబాటు చేసుకునేందుకు కొంత సమయం కావాలని, టాయ్‌లెట్ మాత్రం తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టారని వివరించారు. వారిచ్చిన హామీ మేరకు ఆ మహిళ కేసు ఉపసంహరించకుంద’ని తెలిపారు.