జాతీయ వార్తలు

ఖైదీలకూ హక్కులున్నాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: నేరస్థులు కూడా కొత్త గాలిని పీల్చాల్సిందేనని, వారికున్న కుటుంబ, సామాజిక సంబంధాలను కొనసాగించడానికి వీలుకల్పించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నేరస్థులను సంస్కరించేలా నిబంధనలు ఉండాలని పేర్కొంది. దీర్ఘకాలం పాటు జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలు పెరోలు, ఫర్‌లోకోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వాటిని విచారిస్తున్న సమయంలో మానవతా దృక్పథాన్ని ప్రదర్శించవలసిన అవసరం ఉందని న్యాయమూర్తులు ఎకె సిక్రీ, అశోక్ భూషణ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. పెరోలు, ఫర్‌లోను మంజూరు చేయడానికి ఉన్న నిబంధనలు 1955కన్నా ముందు రూపొందించినవని గుర్తుచేస్తూ, పురాతనమైన ఈ నిబంధనలను ప్రస్తుత కాలానికి అనుగుణంగా సవరించాలని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. నేరస్థుడికి శిక్ష విధించడం ద్వారా సాధించవలసిన ఒక లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ, సదరు నేరస్థుడిని సంస్కరించడానికే శిక్ష అని ధర్మాసనం పేర్కొంది. కాలం చెల్లిన నిబంధనలను వెంటనే అనివార్యంగా సవరించవలసిన అవసరం ఉందని పేర్కొంటూ పెరోల్‌ను కోరుతూ దాఖలయిన దరఖాస్తులను పరిశీలించే వారికి తగిన మార్గదర్శకాలను రూపొందించాలని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. తన తీర్పు ప్రతిని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపిస్తున్నట్టు కూడా ధర్మాసనం తెలిపింది. అయితే జైలుశిక్ష పడిన ఖైదీ తన శిక్షాకాలం మొత్తాన్ని జైలులో గడపాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ సందర్భంలో ఖైదీ ఎవరినయినా స్వల్ప కాలం విడుదల చేస్తున్నారంటే, అతను లేదా ఆమె తన వ్యక్తిగత, కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడానికి మాత్రమే కాదని, సదరు ఖైదీ తన సామాజిక సంబంధాలను నిర్వహించుకోవడానికి కూడా అని పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. స్వల్ప కాలంపాటు అయినా కొత్త గాలిని పీల్చే హక్కు ఖైదీలకు ఉందని పేర్కొంటూ ధర్మాసనం ఖైదీలకు శిక్ష విధించడం వెనుక ఉన్న మరో లక్ష్యాన్ని ప్రస్తావించింది.
సత్ప్రవర్తన గల, నిర్దిష్ట కాలంపాటు జైలు అధికారులకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేసి ఉన్న ఖైదీలను షరతులపై కొద్ది రోజులకోసం విడుదల చేసేదే పెరోలు అని ధర్మాసనం పేర్కొంది. దీర్ఘకాలం పాటు జైలు జీవితం అనుభవించిన ఖైదీలను కొద్ది రోజుల పాటు విడుదల చేసేదే ఫర్‌లో అని వివరించింది.