జాతీయ వార్తలు

ఇటలీ కళ్లద్దాలతో చూడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, అక్టోబర్ 2: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాహుల్ తన ఇటాలియన్ కళ్లద్దాలు తీసి అభివృద్ధిని చూడాలని షా తనదైన రీతిలో ధ్వజమెత్తారు. గుజరాతీ గ్లాసులు ధరించి చూస్తే గుజరాత్‌లో బిజెపి ఎంత అభివృద్ది చేసిందో కనిపిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. పోర్‌బందర్‌లో రెండో విడత గుజరాత్ గౌరవ్ యాత్రను షా ప్రారంభించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యుఎస్ పర్యటన ముగించుకొచ్చి ‘వెకేషన్’ రాజకీయాలు చేస్తున్నారని బిజెపి చీఫ్ విమర్శించారు. గుజరాత్ సిఎంగా, ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఏ అభివృద్ధి చేశారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారన్న షా ‘గుజారాత్‌కు ఎయిమ్స్, రాజ్‌కోట్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం తెచ్చారు. నర్మదా డ్యామ్, పట్టణ పేదలకు ఆరులక్షల ఇళ్లు ఇస్తున్నారు’ అని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాహుల్‌కు ఇవేమీ కనిపించడం లేదని, కేంద్రంలో మూడేళ్ల పాలనలో మోదీ ఏం చేశారని అడుగుతున్నారని షా విమర్శించారు. ‘ఇటాలియన్ గ్లాసులు పెట్టుకుని చూస్తే రాహుల్‌కు అభివృద్ధి ఏం కనిపిస్తుంది?. ముందు ఆ గ్లాసులు మార్చాలి’ అని బిజెపి చీఫ్ హితవు పలికారు. మళ్లీ అధికారంలోకి వచ్చేస్తామని కాంగ్రెస్ పగటికలలు కంటోందని ఆయన ఎద్దేవా చేశారు. ‘కలలుకనే హక్కు అందిరికీ ఉంటుంది. అయితే విదేశీ పర్యటనలు జరుపుతూ అడపాదడపా దేశం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడమే విచిత్రం’ అని ఆయన అన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే కష్టపడి పనిచేయాలని అంతేతప్ప వెకేషన్ రాజకీయాలు కాదని షా చెప్పారు.