జాతీయ వార్తలు

ఏపీకి మణిహారం.. జాతీయ జలమార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ముక్త్యాల నుండి విజయవాడ వరకు గల కృష్ణా నదిని నాలుగో జాతీయ జలమార్గంగా అభివృద్ధి చేసేందుకు సంబంధించిన పథకానికి ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడు మంగళవారం శంకుస్థాపన చేస్తారు. కేంద్ర జల వనరులు, రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. వెంకయ్య నాయుడు నాల్గవ జాతీయ జలమార్గ నిర్మాణానికి శంకుస్థాపన చేయటంతోపాటు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న 675 కిలోమీటర్ల జాతీయ రహదారి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేస్తారు. 1,928.46 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న 415 కిలోమీటర్ల జాతీయ రహదారి ప్రాజెక్టు, 2,539.08 కోట్ల వ్యయంతో చేపడుతున్న మరో 250 కిలోమీటర్ల జాతీయ రహదారి ప్రాజెక్టుకు వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేస్తారు. కేంద్ర ప్రభుత్వం 2016 ఎప్రిల్ 14 తేదీనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంఓయు ప్రకారం కృష్ణానదిలో మొదటి దశ కింద ముక్త్యాల నుండి విజయవాడ వరకు 82 కిలోమీటర్ల జాతీయ జల రహదారిని అభివృద్ధి చేస్తారు. రెండోదశ కింద విజయవాడ నుండి కాకినాడ వరకు, మూడో దశ కింద కృష్ణ, గోదావరి నదులకు సంబంధించిన 573 కిలోమీటర్ల జలమార్గాలు, కొమ్మమూర్ కాలువ, బకింగ్‌హాం కాలువతోపాటు మిగతా ప్రాంతాన్ని జాతీయ జలమార్గంగా అభివృద్ధి చేయవలసి ఉన్నది. ఇప్పుడు మొదటి దశ కింద ముక్త్యాల నుండి విజయవాడ వరకు కృష్ణానదిని జాతీయ జల మార్గంగా అభివృద్ధి చేస్తారు. దీనికి సంబంధించిన డ్రెడ్జింగ్ పనులు 2019 జూన్‌నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ జల మార్గాన్ని అభివృద్ధి చేయటం వలన ఈ ప్రాంతం అభివృద్ధి సాధించటంతోపాటు రాజధాని నగరం అమరావతి అభివృద్ధికి కూడా తోడ్పడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2018 జూన్ నాటికి తాత్కాలిక టెర్మినల్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. 2018 మార్చిలో శాశ్వత టెర్మినల్ నిర్మాణ పనులను కేటాయిస్తారు. 2019 జూన్‌నాటికి ఈ పనులు పూర్తి చేస్తారు. ముక్త్యాల, ఇబ్రహీంపట్నం, హరిశ్చంద్రపురంలో మూడు కార్గో టెర్మినళ్లు నిర్మిస్తారు. ఇదే విధంగా దుర్గాఘాట్, భవానీద్వీపం, వేదాద్రి, అమరావతిలో నాలుగు ప్రయాణికుల టెర్మినల్లు నిర్మిస్తారు. నాల్గవ జాతీయ జలమార్గం కింద 2,890 కిలోమీటర్ల కృష్ణా, గోదావరి నదీమార్గాలను జాతీయ జల మార్గాలుగా అభివృద్ధి చేస్తారు.