జాతీయ వార్తలు

‘బిఎస్‌ఎఫ్’పై ఉగ్ర దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, అక్టోబర్ 3: శ్రీనగర్‌లో ఉగ్ర దాడి ప్రయత్నాన్ని బిఎస్‌ఎఫ్ దళాలు తిప్పికొట్టాయి. పటిష్ట భద్రత కలిగిన శ్రీనగర్ విమానాశ్రయానికి దగ్గరలోని గోగోలాండ్ బిఎస్‌ఎఫ్ దళాల శిబిరంపై జైషే -ఇ -మహ్మద్ సంస్థ ఉగ్రవాదులు ముగ్గురు ఆత్మాహుతి దాడికి ప్రయత్నించారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను తుదముట్టించాయి. ఉగ్రవాదులతో జరిగిన పోరులో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ బికె యాదవ్ మృతిచెందాడు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ‘విమానాశ్రయ పరిసరాల్లో ఉగ్రదాడికి అవకాశం ఉందన్న ఇంటిలిజెన్స్ హెచ్చరికలు నేపథ్యంలో తనిఖీలు జరుపుతుండగా, ఘటన చోటుచేసుకున్నట్టు డిజిపి ఎస్‌పి వాయిద్ వెల్లడించారు. జైషే -ఇ -మహ్మద్ సంస్థకు చెందిన ముగ్గురి ఆత్మాహుతి దళం పేలుళ్లకు కుట్ర పన్నినట్టు నిఘావర్ఘాల నుంచి ముందే సమాచారం ఉందన్నారు. ఘటనపై కాశ్మీర్ రేంజ్ ఐజి మునీర్ ఖాన్ మాట్లాడుతూ బిఎస్‌ఎఫ్ దళాల ప్రతిఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారన్నారు. అయితే, దాడికి ప్రయత్నించిన తీరునుచూస్తే జైషే -ఇ -మహ్మద్ సంస్థ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నట్టు చెప్పారు. ‘విమానాశ్రయానికి దగ్గరలో ఘటన చోటుచేసుకున్నప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు. స్వయంగా ఘటనా ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాం’ అని డిజిపి ఎస్‌పి వాయిద్ వెల్లడించారు. బిఎస్‌ఎఫ్ 182 బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్‌పై ఇటీవలి కాలంలో అనేకసార్లు ఉగ్రవాదుడు దాడికి ప్రయత్నించారు. అయితే, వినియోగంలో లేని ప్రాంతంలో గోడ పూర్తిగా ధ్వంసమవడంతో, అక్కడినుంచే బిఎస్‌ఎఫ్ ప్రాంగణంలోకి టెర్రరిస్టులు చొరబడుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మొదట ఒక ఉగ్రదాడి శిబిరంపైకి కాల్పులు జరుపుతూ చొరబడ్డాడని, అతన్ని దళాలు అంతమొందించారని పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. కొద్దిసేపటికే రెండు దిక్కుల నుంచి మరో ఇద్దరు ఉగ్రవాదులు శిబిరంలోకి చొరబడే ప్రయత్నం చేసి దళాల చేతిలో హతమైనట్టు ఆ పోలీస్ అధికారి వెల్లడించారు.