జాతీయ వార్తలు

కాళేశ్వరం ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) గురువారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం నుంచి పర్యావరణ, అటవీ తదితర అనుమతులు వచ్చేంతవరకూ ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అలాగే కేంద్రం నుంచి చట్టబద్ధమైన అనుమతులు ఎప్పుడు వచ్చినా, ఎన్‌జిటిని ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వుల్లో మార్పులు, చేర్పులు కోరవచ్చని తెలంగాణ ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించింది. అయితే ఉత్తర్వులు మూడు పనిదినాలు పాటు వాయిదా వేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను అక్టోబరు 30వ తేదీకి వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ, అటవీ అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారని, తక్షణమే పనులు నిలుపుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని సిద్ధిపేట జిల్లాకు చెందిన హయతుద్దీన్ అనే వ్యక్తి గ్రీన్ టిబ్యునల్‌లో పిటిషన్ వేశారు. జస్టిస్ జావెద్ రహీం, జస్టిస్ రంజన్ చటర్జీలతో కూడిన ధర్మాసనం గురువారం వరుసగా మూడోరోజూ విచారించింది. పిటిషనర్ తరపున న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ వాదనలు కొనసాగిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుని సంబంధించిన గ్రావిటీ కెనాల్ పూర్తిగా అటవీ ప్రాంతాంలో ఉందని, ప్రాజెక్టు ఫెజ్-1 అటవీ అనుమతులు
నిర్మాణానికి అంగీకరించినట్టు కాదని ట్రిబ్యునల్‌కి వివరించారు. ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టులో కాళేశ్వరం ప్రాజెక్టు భాగంకాదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా దీన్ని నిర్మిస్తోందని, అందుకే పర్యావరణ అనుమతులకు తాజాగా కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారని వాదించారు. కేంద్రానికి సమర్పించిన వివరాలలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టును కొత్త ప్రాజెక్టుగా ప్రభుత్వం పేర్కొందని పిటిషన్ తరపు న్యాయవాది బెంచ్ దృష్టికి తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ప్రాజెక్టు తాగునీటి, సాగునీటి, పరిశ్రమల అవసరాల కోసం నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే దీని నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని ఆయన గుర్తుచేశారు. పర్యావరణ, అటవీ అనుమతులు లభించేవరకూ ఈ ప్రాజెక్టు తాగునీటి అవసరాల కోసం ఉపయోగించుకుంటామని అన్నారు. అలాగే ప్రాజెక్టు కాలువల నిర్మాణాలు కూడా తాగునీరు, సాగునీరు అవసరాల కోసం వేరుగా ఉన్నట్టు ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చారు. ఇప్పటి వరకూ ప్రాజెక్టు ఫెజ్-1 నిర్మాణ పనులకు అనుమతులు మంజురు అయ్యాయని, మరొక ఆరు వారాల్లో ఫెజ్-2 కూడా అనుమతులు మంజూరుకానున్నాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అనుమతులకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నామని ఆయన చెప్పారు. పర్యావరణ అనుమతులు మంజూరు కాకపోతే ప్రాజెక్టు డిజైన్ మార్పులకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ పిటిషన్ విచారణ జనవరి వరకు వాయిదా వేయాలని ఆయన కోరారు. తొలుత విచారణను మధ్యాహ్నానానికి వాయిదా వేసింది. అనంతరం ధర్మాసనం పర్యావరణ అనుమతులు మంజూరయ్యేవరకూ ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలుపుదల చేయాలని మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ ఈనెల 30న చేపడుతుంది.