జాతీయ వార్తలు

ఢిల్లీ ప్రైవేటు పాఠశాలలో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ఢిల్లీలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఆరేళ్ల బాలిక లైంగిక దాడికి గురైంది. గత నెల గుర్‌గావ్‌లోని రేయాన్ ఇంటర్నేషన్ స్కూలులో ఏడేళ్ల బాలుడు బస్సు కండక్టర్ చేతిలో అత్యాచార యత్నం-హత్యకు గురైన సంఘటనను మరువక ముందే ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరగడం కలకలం సృష్టిస్తోంది. దక్షిణ ఢిల్లీ మాల్వీయ నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో వాష్‌రూమ్‌కు వెళ్లిన బాలిక వెనకాలే వెళ్లిన స్వీపర్ (22) బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ స్వీపర్‌ను అరెస్టు చేశారు. పాఠశాలల్లో చిన్నారులపై తరచుగా లైంగిక దాడుల జరుగుతుండడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్ స్కూళ్లలో రక్షణ ఏర్పాట్లను పక్కాగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు.