జాతీయ వార్తలు

రాధే మా హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మా ఢిల్లీలోని ఒక పోలీసు స్టేషన్‌కు వెళ్లి స్టేషన్ హౌస్ అధికారి (ఎస్‌హెచ్‌ఒ) కుర్చీలో కూర్చోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరో పోలీసు స్టేషన్‌లోనూ ఆమె తన అధికార దర్పాన్ని ప్రదర్శించగా, పోలీసు సిబ్బంది ఆమెకు అనుచరుల్లాగా ప్రవర్తించడం విమర్శలకు దారితీసింది. రెండు పోలీసు స్టేషన్లలో రాధే మా ప్రవర్తనను ప్రదర్శించే చిత్రాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. దీంతో పరువు పోగొట్టుకొని నవ్వుల పాలయిన ఢిల్లీ పోలీస్ ఈ రెండు సంఘటనలపై విచారణకు ఆదేశించింది. స్థానిక వివేక్ విహార్ పోలీసు స్టేషన్‌లో రాధే మా ఎస్‌హెచ్‌ఒ కుర్చీలో కూర్చోగా, హిందూ భక్తులు కప్పిన ఎరుపు, బంగారు రంగు శాలువాతో నమస్కరిస్తున్న భంగిమలో ఎస్‌హెచ్‌ఒ సంజయ్ శర్మ ఆమె పక్కన నిలబడి ఉన్నారు. ఈ ఫొటో సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది. జిటిబి ఎంక్లేవ్ పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన రామ్ లీలా ఫంక్షన్‌లో రాధే మా పాల్గొన్న దృశ్యాలతో కూడిన ఒక వీడియో కూడా సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. ఈ కార్యక్రమంలో అయిదుగురు పోలీసు సిబ్బంది దేశభక్తి గీతాలను ఆలపించడం వీడియోలో రికార్డు అయింది. రాధే మా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో అయిదుగురు పోలీసు సిబ్బంది- అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌లు బ్రజ్ భూషణ్, రాధే క్రిషన్, హెడ్ కానిస్టేబుల్ ప్రమోద్, కానిస్టేబుళ్లు హితేశ్, రవీందర్ ఉన్నారని ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఎస్‌హెచ్‌ఒ, అయిదుగురు పోలీసు సిబ్బంది ప్రవర్తనపై విచారణకు ఆదేశించామని, వారిని డిస్ట్రిక్ట్ లైన్స్‌కు పంపించామని ఢిల్లీ తూర్పు మండల జాయింట్ పోలీసు కమిషనర్ రవీంద్ర యాదవ్ తెలిపారు. ఈ విషయంలో అదనపు డిప్యూటి పోలీసు కమిషనర్ స్థాయి అధికారి విచారణ ప్రారంభించారని ఆయన వివరించారు. అయితే, రాధేమా రామ్ లీలా ఫంక్షన్‌లో పాల్గొనడానికి వెళ్తూ మార్గమధ్యంలో వాష్‌రూమ్‌కు వెళ్లడానికి తమ పోలీసు స్టేషన్‌లోకి వచ్చారని ఎస్‌హెచ్‌ఒ చెప్పినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. రాధేమా అలియాస్ సుఖ్వీందర్ కౌర్ ఇప్పటికే న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.

చిత్రం.. ఢిల్లీలోని ఓ పోలీసు స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓ కుర్చీలో ఠీవిగా కూర్చున్న రాధే మా. పక్కన వినయంగా నిలబడిన స్టేషన్ హౌస్ ఆఫీసర్.