జాతీయ వార్తలు

సబర్బన్ రైల్వే బ్రిడ్జిలను ఖాళీ చేయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 5: ముంబయిలోని పరేల్-ఎల్ఫిన్‌స్టోన్ రోడ్ స్టేషన్‌లోని ఫుట్‌ఓవర్ రైల్వే బ్రిడ్జిపై జరుగుతున్న అన్ని రకాల చిల్లర వ్యాపారులను వెంటనే ఖాళీ చేయించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) డిమాండ్ చేసింది. ఎన్ఫిన్‌స్టోన్ రైల్వే బ్రిడ్జిపై సెప్టెంబర్ 29న జరిగిన తొక్కిసలాటలో 23 మంది మరణించిన విషయం తెలిసిందే. ఎంఎన్‌ఎస్ అధినేత రాజ్ థాకరే గురువారం మెట్రో రేల్వే స్టేషన్‌లో వద్ద నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతూ ముంబయిలోని అన్ని సబర్బన్ రైల్వే బ్రిడ్జిలపై నడుస్తున్న చిల్లర వ్యాపారస్తులను 15 రోజుల్లో ఖాళీ చేయించాలని, అందుకు ఈ రోజు శాంతియుతంగానే ఆందోళన చేస్తున్నామని, ఆ తర్వాత పరిస్థితి చేయిదాటితే రైల్వే శాఖే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా ప్రధాని నరేంద్ర మోదీపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘అబద్ధాలు చెబుతూ ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారు? రోజూ మాటలతోనే కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఇలా ఎంతకాలం సాగిస్తారు?’ అని మోదీని నిలదీశారు. ఎంఎన్‌ఎస్ తదుపరి చేయబోయే ఆందోళన కార్యక్రమం శాంతియుతంగా ఉండదని హెచ్చరించారు. ధర్నా అనంతరం వెస్ట్రన్ రైల్వే హెడ్‌క్వార్టర్స్‌కు ఊరేగింపుగా కదలివెళ్లారు. దీంతో అనేకచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

చిత్రం..రైల్వే స్టేషన్లలో నాసిరకం వౌలిక సదుపాయాలకు నిరసనగా గురువారం భారీ ప్రదర్శన నిర్వహించిన ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు