జాతీయ వార్తలు

‘మత్తు’ వీడితేనే భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిద్వార్, అక్టోబర్ 5: మద్యానికి యువత బానిస కావడంపట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారిని అదుపు చేయకపోతే రానున్న పాతికేళ్లలో సామాజిక పరిస్థితులు మరింత దుర్భరంగా మారతాయంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరిక స్వరాన్ని వినిపించారు. హరిద్వార్‌కు చెందిన ఓ సామాజిక మత సంస్థ ఉమియా సంస్థాన్ సభ్యులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మోదీ మద్యపానానికి యువత దూరం కావాలని స్పష్టం చేశారు. సామాజిక సమస్యలు తీర్చడంలో ఈ సంస్థాన్ చేస్తున్న ప్రయత్నాలను మోదీ ప్రశంసించారు. నవతరంలో మద్యపాన అలవాటు మాన్పించడానికి ఈ సంస్థ అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తోందని, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ పారిశుధ్యం పట్ల కూడా అవగాహనను పెంపొందిస్తోందని తెలిపారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో సంభవించిన భూకంప బాధితులకు సహాయ సహకారాలను అందించడంలోనూ, భ్రూణ హత్యలను నివారించడంలోనూ ఈ సంస్థ చేసిన సేవలను మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. నేటి యువత మద్యానికి బానిసలు కాకుండా వారిలో చైతన్యం తీసుకొచ్చే దిశగా మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ‘ఓ దేశ ప్రధానమంత్రిగా కాకుండా మీలో ఒకడిగా ఎదిగిన ఓ వ్యక్తిగా నేనీ విషయాన్ని చెబుతున్నాను. రోజువారీగా యువతలో పెరిగిపోతున్న మద్యపాన అలవాటుకు సంబంధించి పుంఖాను పుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. ఇదే పరిస్థితి అడ్డూ అదుపూ లేకుండా కొనసాగితే పాతికేళ్లలో సామాజిక పరిస్థితులు దుర్భరమవుతాయి’ అని హెచ్చరించారు. గతంలో ఈ సంస్థ చేసిన సేవలను దృష్టిలో పెట్టుకునే నేటి యువతను కూడా సన్మార్గంలో పెట్టాలని మద్యపాన అలవాటు మానేలా చేయాలని తాను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

చిత్రం..హరిద్వార్‌లోని సామాజిక మత సంస్థ ఉమియా సంస్థాన్ సభ్యులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ప్రధాని మోదీ