జాతీయ వార్తలు

భారం తగ్గింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6:దేశంలో విప్లవాత్మక రీతిలో అమలులోకి వచ్చిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) విషయంలో తలెత్తుతున్న వ్యాపార, వాణిజ్య, వర్తక, వినియోగదారుల్లో తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కొంత మేర ఊరట కలిగించింది. కొన్ని వస్తువులకు సంబంధించి పన్నులను తగ్గించింది. ఎగుమతిదారులకూ వెసులుబాటు కల్పించింది. గ్రానైట్ పరిశ్రమపై పన్నును 28శాతం నుంచి 18శాతానికి కుదించింది. 50వేలకుపైన జరిగే బంగారం కొనుగోళ్లకు ప్యాన్ అవసరం లేదని తెలిపింది. గృహోపకరణాలు, వినియోగ పస్తువులపైన అమలు అవుతున్న పన్ను రేటును తగ్గించింది. రెస్టారెంట్లపైన విధించిన పన్నును 18శాతం నుంచి 12శాతానికి కుదించింది. ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న ద్రవ్య లభ్యత సమస్యనూ తీర్చింది. వీరికి రీఫండ్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని నిర్ణయించింది. జూలై నెల రీఫండ్‌ను ఈ నెల పదిన, ఆగస్టు నెల రీఫండ్‌ను 18న ఎగుమతి దారులకు చెల్లిస్తామని తెలిపింది. దాదాపు 27వస్తువులపై విధించిన రేట్లను తగ్గిస్తూ శుక్రవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలో జరిగిన జిఎస్‌టి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. జిఎస్‌టి అమలులోకి వచ్చి మూడు నెలలైందని, ఇప్పటి వరకూ రెండు నెలలకు సంబంధించి రిటర్న్‌లు దాఖలైనందున దీని అమలుకు సంబంధించిన సంక్లిష్ట అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని జైట్లీ అన్నారు. ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య, వర్తకులపై దీని ప్రభావం ఎలా
ఉందన్నదీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని చిన్న వ్యాపారులకు వెసులుబాటు కల్పిస్తున్నామని, కాంపోజిషన్ స్కీమ్ పరిమితిని కోటి రూపాలకు పెంచుతున్నామని చెప్పారు. దీని వల్ల మూడు నెలలకొక సారి చిన్న వ్యాపారస్తులు తన రిటర్న్‌లను దాఖలు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ జిఎస్‌టి పన్నుల రిటర్న్‌లను దాఖలు చేయడానికి వీలు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తాజా మార్పుల నేపథ్యంలో రెస్టారెంట్లు 5శాతం జిఎస్‌టిని చెల్లించాల్సి ఉంటుందని, వర్తకులు ఒక శాతం, ఉత్పాతక రంగం రెండు శాతం జిఎస్‌టిని చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే మామిడి పళ్ల రసంపై జిఎస్‌టిని 12శాతం నుంచి 5శాతానికి, ఖారా చపాతీపై 12 నుంచి 5శాతానికి జిఎస్‌టిని తగ్గించామన్నారు. ఫుడ్ ప్యాకేజీలపై ప్రస్తుతం ఉన్న 18శాతం పన్నును 5శాతానికి, రబ్బర్ వృథాపైనా 5శాతానికి తగ్గిస్తున్నామన్నారు. మొత్తం మీద 27 వస్తువులపై పన్నులను కుదించామని చెప్పారు. 29లక్షల రెవిన్యూ కంటే తక్కువగా ఉన్న సర్వీసు ప్రొవైడర్లను ఐజిఎస్‌టి నుంచి మినహాయించినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా, ఆభరణాలు, రత్నాలపై జారీ చేసిన జిఎస్‌టి నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు కేంద్రం మరో ప్రకటనలో తెలిపింది. అలాగే 50వేల పైన జరిగే ఆభరణాల కొనుగోళ్లకు ప్యాన్, ఆధార్ అవసరం లేదని తెలిపింది. దాదాపు రెండు కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ కలిగిన రత్నాలు, ఆభరణాలు, ఇతర అధిక విలువ కలిగిన వస్తువుల వ్యాపార సంస్థలను మనీ ల్యాండరింగ్ చట్టం మినహాయిస్తున్నట్టు తెలిపింది.