జాతీయ వార్తలు

కుప్పకూలింది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటానగర్/ న్యూఢిల్లీ, అక్టోబర్ 6: భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ 17 హెలీకాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో శుక్రవారం కూలిపోవడంతో అందులోని ఏడుగురు సైనిక సిబ్బంది దుర్మరణం చెందారు. ఇద్దరు పైలెట్లు సహా ఐదుగురు వైమానిక సిబ్బంది ఉన్నారని, మరో ఇద్దరు జవాన్లని అధికారులు తెలిపారు.
చైనా సరిహద్దుకు సమీపంలోని ఓ మారుమూల పట్టణంలో ఉదయం 6.30కి ఈ ప్రమాదం జరిగినట్టు వెల్లడించారు. తవాంగ్ సమీపంలోని కిర్మూ హెలీప్యాడ్ నుంచి హెలీకాప్టర్ బయలుదేరిందని యాంగ్‌స్తే శిబిరంలో దిగడానికి ముందే ప్రమాదానికి గురైనట్టు తవాంగ్ ఎస్‌పి ఎంకె మీనా తెలిపారు. మృతదేహాలన్నింటినీ ఐఎఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకుంది. మృతదేహాలను గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు అధికారులు హుటాహుటిన అక్కడికి తరలివెళ్లారు. అలాగే ప్రమాదకారణాలు నిర్ధారించేందుకు వైమానికదళం దర్యాప్తుకు ఆదేశించింది.

చిత్రం..తవాంగ్‌వద్ద వైమానిక హెలీకాప్టర్‌కు ప్రమాదం