జాతీయ వార్తలు

సదావర్తిపై హక్కెవరిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబరు 6: సదావర్తి సత్రం భూముల హక్కులు ఎవరివో ఉమ్మడి హైకోర్టు పరిష్కరిస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. సదావర్తి భూముల కేసును హైకోర్టుకు డిస్పోజ్ చేస్తూ, భూములు ఆంధ్ర దేవాదాయశాఖ సంబంధించినవా? లేక తమిళనాడు ప్రభుత్వానివో తేల్చాలని ఆదేశించింది. అలాగే మొదట వేలంపాడిన సంజీవరెడ్డి చెల్లించిన సోమ్మును, రెండో వేలంపాటలో పాల్గొన్న రెండో బిడ్డర్ చెల్లించిన సొమ్మును వెనక్కి తిరిగి చెల్లించాలని ఆదేశించింది. దీంతో భూములు వేలం పాట రద్దుకావడంతో పాటు, భూములు వేలంలో పాడిన వారికి ఎవ్వరికీ దక్కకుండాపోయాయి. సదావర్తి భూములను నిబంధనలు ఉల్లంఘించి అధికార పార్టీ నేతలు తక్కువ ధరకు దక్కేలా చేశారని ఆరోపిస్తూ వైకాపా ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయిస్తే, హైకోర్టు తిరిగి వేలం నిర్వహించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ నిబంధనల ప్రకారం రూ.22 కోట్లకు వేలంలో పాడామని, తమకే భూములు చెందేలా
ఆదేశాలివ్వాలని సంజీవరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో రెండోసారి వేలం నిర్వహించాలని స్పష్టం చేయడం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి దేవాదాయ శాఖ బహిరంగ వేలం నిర్వహించింది. అయితే వేలం పాటలో మొదటి బిడ్డర్ నగదు చెల్లించలేదు. దీంతో రెండో బిడ్డర్‌కు అవకాశం దక్కింది. శుక్రవారం తాజాగా సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు ఈ వేలం వివరాలను రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది వివరించారు. ఇక కేసు విచారణను ఇక్కడ ముగించేద్దామని ధర్మాసనం పేర్కొంది. ఈ సమయంలో తమిళనాడు ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ భూములు తమిళనాడు ప్రభుత్వానివని, ఆంధ్ర దేవాదాయశాఖకు సంబంధం లేదని వాదించారు. ఈ భూములకు పట్టాలు ఇవ్వాల్సింది తమిళనాడు ప్రభుత్వమేనని ధర్మాసనానికి వివరించారు. అలాగే దీనిపై ఉమ్మడి హైకోర్టులో మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసినట్టు కోర్టుకు వివరించారు. ఈ భూములకు సంబంధించిన కేసు మద్రాసు హైకోర్టులో ఉందని, వేలం పాడిన బిడ్డర్‌కు భూములు ఇవ్వరాదని ధర్మాసనం ముందు వాదించారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది రామకృష్ణ ప్రసాద్ వాదనలు కొనసాగిస్తూ మొదటి వేలంలో డిపాజిట్ చేసిన డబ్బులను 18శాతం వడ్డీకి తెచ్చుకున్నామని, ఎక్కవకాలం డిపాజిట్ సొమ్ము ప్రభుత్వ దగ్గర ఉంచుకుని ప్రస్తుతం 8శాతం వడ్డీతో వెనక్కి తిరిగిస్తే తాము నష్టపోతామని వివరించారు. ఈ సమయంలో సీపీఐ నారాయణ తరఫు న్యాయవాది శ్రవణ్ వాదనలు వినిపిస్తూ భూముల అవకతవకల వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరగా ధర్మాసనం ఆ దరఖాస్తును తోసిపుచ్చింది. దీంతో ముందు ఈ భూములు ఎవరివన్నది తేల్చాలని ఉమ్మడి హైకోర్టును ఆదేశించటంతోపాటు, వెలంలో పాల్గొని డిపాజిట్ చేసిన సొమ్మును వెనక్కి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.