జాతీయ వార్తలు

గాంధీ హత్య కేసును మళ్లీ విచారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: మహాత్మా గాంధీ హత్య కేసును తిరిగి విచారించాలని కోరుతూ దాఖలయిన ఒక పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్‌ఎ బోబ్డే, ఎల్.నాగేశ్వర రావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం కొద్ది సేపు ఈ కేసును విచారించిన అనంతరం ఈ కేసులో న్యాయస్థానానికి సహకరించడానికి సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ అమరేందర్ శరణ్‌ను అమికస్ క్యూరీగా నియమించింది. సుమారు 15 నిముషాల సేపు సాగిన ఈ కేసు విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం తొలుత.. ఎంతో కాలం క్రితం తీర్పు వెలువడిన ఈ కేసులో ఇప్పుడు చట్టపరిధిలో ఏమీ చేయజాలమని వ్యాఖ్యానించింది. అయితే ఈ అంశంలో మీరు ముందుకు సాగకుండా ఆపడానికి తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని ధర్మాసనం తరువాత శరణ్‌కు చెప్పింది. అనంతరం ధర్మాసనం ఈ కేసు విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ముంబయికి చెందిన పరిశోధకుడు, అభినవ్ భారత్ అనే సంస్థ ట్రస్టీ డాక్టర్ పంకజ్ ఫడ్నిస్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. గాంధీజీ హత్య కేసును పునః విచారించాలని కోరడానికి అనేక సహేతుక కారణాలు ఉన్నాయని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.