జాతీయ వార్తలు

అరెరే.. లేడీస్ టాయిలెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛోటా ఉదయ్‌పూర్, అక్టోబర్ 12: గుజరాత్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇక్కడకు వచ్చిన రాహుల్ ఛోటా ఉదయ్‌పూర్‌లో యువతతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతవరకూ బాగానే ఉంది. సమావేశం ముగించుకున్న రాహుల్ గాంధీ పొరపాటున లేడీస్ టాయిలెట్‌లోకి వెళ్లారు. ఏమయిందంటే.. వాష్ రూమ్ బయట గోడకు ‘మహిళో మతే శౌచాలయ’ అంటూ రాసి ఉంది. అది గుజరాత్‌లో ఉండడంతో గమనించని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గబగబ లోపలకి వెళ్లారు. ఆయన వెంట ఉన్న ఎస్‌పిజి కమెండోలు తేరుకునే లోపలే రాహుల్ జరిగిన పొరపాటును గమనించి బయటకు వచ్చేశారు. ఇదంతా కొన్ని సెకన్లలోనే జరిగిపోయింది. అక్కడే ఉన్న మహిళలు దీన్నంతా సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీయడం మొదలెట్టారు. ఫొటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారాయ.