జాతీయ వార్తలు

కాంగ్రెస్‌లోకి రేవంత్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: తెలంగాణ తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్‌లో చేరేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎదుట మూడు షరతులు పెట్టడం చూస్తే, రేవంత్ తన నిర్ణయం తీసేసుకున్నట్టే కనిపిస్తోంది. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను కలిసిన రేవంత్, పార్టీలో చేరే అంశాన్ని చర్చించారని అంటున్నారు. సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సి కుంతియా కూడా ఉన్నారని తెలుస్తోంది. నవంబర్ 9న మహబూబాబాద్ జిల్లాలో టిపిసిసి నిర్వహించనున్న రాహుల్ సభలో రేవంత్ చేరేందుకు నిర్ణయమైందని చెబుతున్నారు. రేవంత్‌తోపాటు పలువురు సీనియర్ తెదేపా నేతలూ కాంగ్రెస్‌లో చేరుతారన్న వాదన వినిపిస్తోంది. అయితే,
కాంగ్రెస్‌లోకి రావాలంటే తన డిమాండ్లు నెరవేర్చాలని రేవంత్ కోరినట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించాలని, తనతోపాటు కాంగ్రెస్‌లో చేరే పదిహేను నుండి ఇరవై మంది తేదేపా నేతలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లివ్వాలని, శాసనసభ ఎన్నికల సందర్భంగా తనను రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా నియమించాలని రాహుల్ ఎదుట రేవంత్ డిమాండ్లు పెట్టారని అంటున్నారు. రాష్ట్రంలోని దాదాపు 20 అసెంబ్లీ సెగ్మెంట్ల జాబితాను రాహుల్‌కు ఇచ్చి, ఆ నియోజకవర్గాల్లో ప్రస్తుతం కాంగ్రెస్‌కు పెద్దగా పలుకుబడి లేదని వివరిస్తూనే, ఆ సెగ్మెంట్లను తనతోపాటు కాంగ్రెస్‌లో చేరే వర్గీయులకు కేటాయించాలని కోరినట్టు తెలిసింది. ఇదిలావుంటే, తనకు సిఎం పదవి కావాలనే డిమాండ్ ఏదీ రేవంత్ పెట్టలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చూపాకే, సిఎం పదవి గురించి ఆలోచించాలన్నది రేవంత్ ఆలోచనగా చెబుతున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు పార్టీ సీనియర్ ఎస్ జైపాల్‌రెడ్డి ఆశీస్సులు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ సిఎం కెసిఆర్‌ను ఎదుర్కోగల ఏకైక నేత రేవంత్‌రెడ్డేనని, ఆయన్ను పార్టీలో చేర్చుకోవటం వల్ల లాభమే తప్ప తప్ప నష్టం లేదని తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన ఒకరిద్దరు సీనియర్లు హైకమాండ్‌కు సూచించినట్టు చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సంబంధించిన ప్రయత్నాలు మూడు నెలల క్రితమే ప్రారంభమయ్యాయని, రాష్టస్థ్రాయిలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అంగీకరించిన తరువాతే ఢిల్లీకి తీసుకెళ్లి రాహుల్‌తో భేటీ ఏర్పాటు చేశారని అంటున్నారు.
అయితే రేవంత్ మాత్రం తాను కాంగ్రెస్‌లో చేరే అంశాన్ని చర్చించేందుకు రాలేదని అంటున్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కోర్టు పనిపై ఢిల్లీకి వచ్చానని, గత ఏప్రిల్‌లో జరిగిన తెరాస ఆవిర్భావ సభ సందర్భంగా ఆ పార్టీ నేతలు చేసిన కూలి పని పేరుతో నిధుల సమీకరణ గురించి ఈసీ, సిబిఐ, కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసే పని కూడా ఉందంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో తాను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించిన నామినేషన్ పత్రాలపై సంతకం చేసేందుకే ఉత్తమ్ కుమార్‌రెడ్డిని ఢిల్లీకి రప్పించారనే మాట కూడా వినిపిస్తోంది. తెలంగాణలో తెదేపాకు పెద్దగా రాజకీయ భవిష్యత్ లేదు. అందుకే ఆ పార్టీ సీనియర్లు, జిల్లా నేతలు కాంగ్రెస్‌లో చేరే ఆలోచనతో ఉన్నారని అంటున్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు 2019లో జరుగాల్సివున్నా, సిఎం కె చంద్రశేఖరరావు వచ్చే ఏడాది అంటే 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిపించుకునే ఆలోచనతో ఉన్నారనే వార్తలు తెలుగుదేశం నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. అందుకే వారు వీలైనంత త్వరగా తమ రాజకీయ భవిష్యత్‌పై ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు.

చిత్రాలు..రాహుల్‌, రేవంత్