జాతీయ వార్తలు

బెంగాల్‌లో పట్టు బిగిస్తున్న బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 23: రెండేళ్ల క్రితం లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రజల్లో కొంత మేరకు పట్టును కోల్పోయిన బిజెపి ఇటీవల పశ్చిమ బెంగాల్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అక్కడి ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చి సత్తా చాటుకుంది. ముఖ్యంగా 70కి పైగా నియోజకవర్గాల్లో ప్రతిపక్ష లెఫ్ట్ ఫ్రంట్-కాంగ్రెస్ పొత్తును నీరుగార్చడంలో బిజెపి సఫలీకృతమైంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో బిజెపి ఓట్ల వాటా 17.5 శాతం నుంచి 10.2 శాతానికి తగ్గినప్పటికీ ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ తన సొంత శక్తితో పోటీచేసి తొలిసారి మూడు సీట్లను గెలుచుకోగలిగింది. ఇంతకుముందు ఈ రాష్ట్రంలో రెండు ఉప ఎన్నికల్లో గెలుపొందిన బిజెపికి 2011లో దాదాపు 4.06 శాతం ఓట్లు లభించాయి. అయితే పశ్చిమ బెంగాల్‌లో గత రెండేళ్లలో చాలామేర పట్టును కోల్పోయిన బిజెపికి ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడం ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సంతోషాన్ని కలిగిస్తోంది. 2011లో ఈ రాష్ట్రంలో 19.5 లక్షలుగా ఉన్న బిజెపి ఓట్లు ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో దాదాపు 56 లక్షలకు పెరగడంతోపాటు రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 262 నియోజకవర్గాల్లో ఆ పార్టీ 10శాతం పైచిలుకు ఓట్లు రాబట్టుకుని ఉనికిని చాటుకోవడంతో కమలనాథులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్‌లో బిజెపి సంస్థాగతంగా బలపడటం వల్లనే ఈ ఫలితాలు సాధించగలిగామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు. ‘బెంగాల్‌లో బిజెపికి సంస్థాగతమైన పునాదులు లేకపోయినప్పటికీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో 17 శాతం ఓట్లను సాధించగలిగాం. అప్పట్లో నరేంద్ర మోదీ ప్రభంజనం బలంగా ఉండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఇటువంటి పవనాలేమీ లేకపోయనా శాసనసభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించగలిగామంటే మా పార్టీ బలపడటమే కారణం’ అని వివరించారు.

చిత్రం బెంగాల్‌లో తమ పార్టీ నేత రూపా గంగూలీపై దాడికి నిరసనగా సోమవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం వద్ద ధర్నాకు దిగిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌ను అడ్డుకుంటున్న పోలీసులు