జాతీయ వార్తలు

ప్రజాసేవలోనే తరిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేదార్‌నాథ్, అక్టోబర్ 20: మానవ సేవే మాధవ సేవ అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. శుక్రవారం కేదార్‌నాథ్ ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ఐదు ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన మోదీ ‘ఈ హిమాలయ ఆలయాన్ని సందర్శించిన తరువాత దేశానికి మరింత అంకితభావంతో పని చేయాలన్న తపన నాలో పెరిగింది’ అని అన్నారు. 2013లో పెను ఉప్పెన కారణంగా ఈ ఆలయం దెబ్బ తిన్నపుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా పునర్ అభివృద్ధి పనులను చేపట్టడానికి తాను ప్రయత్నించానని, కానీ, అప్పుడు కేంద్రంలో అధికారంలోవున్న కాంగ్రెస్ పార్టీ తనను ముందుకు వెళ్లనివ్వలేదని అన్నారు. శీతాకాలం సందర్భంగా ఆలయాన్ని మూసివేయడానికి ఒక రోజు ముందే ఇక్కడికి వచ్చిన మోదీ ప్రార్థనలు జరిపారు. ప్రజలకు సేవ చేయడమే ఆ దేవుడికి సేవ చేయడంతో సమానమని పేర్కొన్న మోదీ రుద్రాభిషేకం కూడా నిర్వహించారు. 2013లో సంభవించిన పెను విలయం సమయంలో దెబ్బతిన్న ప్రాంతాలు అన్నింటిలోనూ పునర్నిర్మాణ బాధ్యతలను చేపట్టడానికి తాను స్వయంగా ముందుకు వచ్చానని, కానీ అప్పట్లో తన ప్రయత్నం ఫలించలేదని తెలిపారు. ఎప్పుడైతే తాను ఈ ఆశయాన్ని వ్యక్తం చేశానో దాని గురించి టీవీ చానెళ్లలో గంటలోనే విస్తృత ప్రచారం జరిగిందని, వేలాదిమందిని బలిగొన్న ఆ పెను విలయం తనను కలచివేసిందని మోదీ గుర్తు చేశారు. ఎప్పుడైతే తన ఆలోచనల గురించి ప్రచారం జరిగిందో ఢిల్లీలోని యూపీ ప్రభుత్వం కదిలిపోయిందని అన్నారు. అందుకే తన అభ్యర్థనను మన్నించవద్దంటూ అప్పటి ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై కేంద్రం వొత్తిడి తెచ్చిందని మోదీ అన్నారు. దాని కారణంగానే ‘మా రాష్ట్రంలో జరిగిన విలయ సమయంలో సహాయ సహకారాలు అందించడానికి గుజరాత్ ప్రభుత్వ సాయం అవసరం లేదు’ అంటూ అప్పటి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక ప్రకటన చేసిందని గుర్తు చేశారు. దాంతో తాను తీవ్ర నిరుత్సాహంతోనే వెనుతిరిగానన్నారు. కానీ, ఆ మహాశివుడే ఇప్పుడు తనకు ఆ అవకాశాన్ని ఇచ్చాడని, దెబ్బతిన్న ఆలయాల పునర్నిర్మాణ బాధ్యతను తనకే అప్పగించాడని మోదీ పేర్కొన్నారు. అప్పట్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగావున్న విజయ్ బహుగుణ కాంగ్రెస్ నాయకుడని, ఇప్పుడు బిజెపిలో చేరారని తెలిపారు. ప్రస్తుతం శంఖుస్థాపన జరిగిన ప్రాజెక్టుల్లో భాగంగా భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తారు. కొన్ని గోడలను పునర్నిర్మిస్తారు. మందాకిని, సరస్వత నద తీరాల్లోని ఘాట్ల నిర్మాణాన్నీ చేపడతారు. అలాగే ఆలయానికి దారితీసే అనుసంధాన మార్గాన్నీ పునర్నిర్మిస్తారు. 2013లో దెబ్బతిన్న ఆదిశంకరాచార్య సమాధిని కూడా పునర్నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టులన్నీ అత్యంతో వ్యయంతో కూడుకున్నవైనప్పటికీ తన ఆశయానికి అద్దం పడుతున్నాయని మోదీ అన్నారు. నిర్ణీత కాలవ్యవధిలోనే వీటి నిర్మాణాన్ని పూర్తి చేసేవిధంగా నిధులను అందిస్తామని హామీ ఇచ్చారు. మరింత అద్భుతమన రీతిలో కేదారనాథ్ ఆలయాన్ని అభివృద్ధి చేసే విధంగా కార్పొరేట్ సంస్థల సహాయ సహకారాలు కూడా తీసుకుంటామని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రాన్ని టూరిస్టులకు అత్యంత ప్రధానమైన కేంద్రంగా మార్చేందుకు ప్రజలు తోడ్పడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చిన మోదీ, 2022కల్లా సేంద్రీయ రాట్ట్రంగా ఉత్తరాఖండ్‌ను తీర్చిదద్దేందుకు కృషి చేయాలన్నారు.
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తయ్యే 2022నాటికి ప్రతి భారతీయుడి ఆశలు, ఆకాంక్షలు నెరవేరేలా కేదారనాథుడు ఆశీస్సులు అందిస్తారన్న నమ్మకాన్ని మోదీ వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోకి రావడానికి ముందు కేదార్‌నాథ్ సమీపంలోని గరూర్‌చెట్టి ప్రాంతంలో తాను గడిపిన రోజులను మోదీ గుర్తు చేసుకున్నారు. తాను ఈరోజు కలుసుకున్న కొందరు, అప్పట్లో తాము గడిపిన క్షణాలను గుర్తు చేశారని అన్నారు. అవన్నీ తన జీవితంలో మధురమైన క్షణాలేనని పేర్కొన్న మోదీ, నిజానికి తాను ఇక్కడే శాశ్వతంగా స్థిరపడిపోయి బాబా పాదాలచెంతే జీవితం గడపాలనుకున్నానని, కానీ ఆయన తనకు అప్పగించిన బాధ్యత మరొకటైందని అన్నారు. ‘కేవలం ఒక బాబా పాదాలచెంతే నా జీవితాన్ని గడపడానికి ఆ పరమ శివుడు అంగీకరించలేదు. మొత్తం 125 కోట్లమంది ప్రజలకు సేవ చేయాలని నన్ను పంపించాడు. మానవ సేవే మాధవ సేవ అన్నది ఆయన నాకు అప్పగించిన బాధ్యత పరమార్థం’ అని మోదీ అన్నారు.

చిత్రం..కేదారనాథ్ ఆలయాన్ని సందర్శించి, ప్రజా సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ