జాతీయ వార్తలు

మన దౌత్యం పదునెక్కాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: భారత దేశం తన దౌత్యవేత్తల సంఖ్యను గణనీయంగా పెంచుకోవల్సిన అవసరంతోపాటు విదేశీ సర్వీసుల కోసం ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాల్సింది కూడా ఎంతో ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, విదేశీ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్ చైర్మన్ శశిథరూర్ ఉద్ఘాటించారు. బ్రెజిల్ విదేశీ సర్వీసులో 1200 మంది దౌత్యవేత్తలు పనిచేస్తున్నారని అలాగే చైనా విషయానికి వస్తే 6వేల మంది దౌత్యవేత్తలు ఉన్నారని అమెరికా కూడా 20వేల మందికి పైగా దౌత్యవేత్తలను కలిగి ఉన్నారని ఈ సందర్భంగా థరూర్ స్పష్టం చేశారు. అయితే భారత్ అమెరికా లేదా చైనా మాదిరిగా ఉండాలని తాను చెప్పడం లేదని పేర్కొన్న ఆయన ‘ప్రస్తుతం భారత్ 800 మంది దౌత్యవేత్తలనే కలిగి ఉంది. పెరుగుతున్న విదేశీ అవసరాల దృష్ట్యా వీరి సంఖ్య ఎంతమాత్రం సరిపోదు. ఎంతగా దౌత్యవేత్తలను పెంచుకుంటే, ఎంతగా వారికి శిక్షణ ఇస్తే అంతగానూ విదేశీ వ్యవహారాల్లో రాణించడానికి అవకాశం ఉంటుంది’అని పేర్కొన్నారు. భారత దేశ విదేశీ సర్వీసుల్లో పనిచేస్తున్న వారి సంఖ్యను గణనీయంగా పెంచడం ఎంతో అవసరమని ప్రస్తుతం ఇందులో పనిచేస్తున్న వారి సంఖ్య దారణంగా ఉందంటూ కమిటీ ఇటీవల కేంద్రానికి ఓ నివేదిక అందించింది. మొత్తం 912 మంది పనిచేయాల్సిన ఈ విభాగంలో కేవలం 770 మంది ఐఎఫ్‌ఎస్ అధికారులే ఉన్నారని థరూర్ అన్నారు. ఇటు విదేశాంగ మంత్రిత్వశాఖకు అటు కేంద్రానికి అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లు, అవి పూర్తిచేయాలని లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుంటే వీరి సంఖ్య ఎంత మాత్రం సరిపోదని కమిటీ తేల్చిచెప్పింది. గత ఏడాది విదేశీ సర్వీసుల్లో కొంత మందిని తీసుకున్నప్పటికీ వీరంతా పరిస్థితులను అర్ధం చేసుకుని విధులు నిర్వహించడానికి కనీస పక్షంగా పదేళ్లు పడుతుందని అనే్నళ్ల సుదీర్ఘ అనుభవం లేకపోతే సమర్ధవంతంగా దౌత్యవిధులను నిర్వర్తించలేరని ఆయన అన్నారు. అలాగే ఐఎఫ్‌ఎస్ ల్లో చేరేవారి కోసం ప్రత్యేకంగా పరీక్షను నిర్వహించాలన్న తన సూచనపై మరింత వివరణ ఇచ్చిన థరూర్‌‘ఒకప్పుడు ఐఎఫ్‌ఎస్ ఉద్యోగం అంటే స్వర్ణయుగంగా ఉండేది. యుపిఎస్‌సిలో ర్యాంకుల్లో 10 ఏళ్లు పనిచేస్తే తప్ప ఐఎఫ్‌ఎస్‌లో చేరడానికి అవకాశం ఉండేది కాదు’అని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని విదేశీ సర్వీసుల్లో చేరాలన్న ఆసక్తిలేకపోయినా ఇందులోకి వచ్చేవారి సంఖ్య పెరుగుతోందని థరూర్ తెలిపారు. అయితే మిగతా సర్వీసులకంటే కూడా విదేశీ సర్వీసుల్లో దౌత్యవేత్తలుగా పనిచేయాలనుకున్న వారికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండి తీరాలని అందుకోసమే విడిగా పరీక్షను పెట్టడం అవసరమని ప్యానెల్ అభిప్రాయపడింది. అంతర్జాతీయ వ్యవహారలపై లోతైన అవగాహనతో పాటు ఇతర భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తి మొదలైనవి దౌత్యవేత్తలకు అత్యంత కీలకమన్నారు.

చిత్రం..శశిథరూర్