జాతీయ వార్తలు

మోదీకి ఈసీ దాసోహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అడుగులకు మడుగులు వత్తుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం తీవ్రంగా విమర్శించారు. గుజరాత్ ఎన్నికల తేదీలను ప్రకటించే అధికారం నరేంద్ర మోదీకి ధారదత్తం చేసిందంటూ ట్వీట్లు సంధించారు. ఇసిపై ధ్వజమెత్తుతూ ట్వీట్ల పరంపరం కొనసాగించారు. నరేంద్ర మోదీ వత్తిడి మేరకే కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటనను ఆలస్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే అధికారం ప్రధాన మంత్రికి ధారాదత్తం చేసిని కేంద్ర ఎన్నికల సంఘం సెలవులు తీసుకున్నదంటూ వ్యంగ్య బాణాలు విసిరారు. కేంద్ర ఎన్నికల సంఘం గత వారం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును తరువాత ప్రకటిస్తామని చెప్పటం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచే కేంద్ర ఎన్నికల సంఘంపై విమర్శల యుద్ధం ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అభిషేక్ సింఘ్వి, ఆనంద్ శర్మ, కపిల్ సిబల్ తదితర నాయకులు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వియంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని దుయ్యబడుతునే ఉన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకు వేసి నరేంద్ర మోదీ ఆదేశం మేరకే కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ శాసన సభ ఎన్నికల తేదీలను ప్రకటించలేదు, మోదీ గుజరాత్ బహిరంగ సభ కోసమే ఇలా చేశారంటూ విమర్శలు గుప్పించటం తెలిసిందే. ఇప్పుడు చిదంబరం రంగంలోకి వచ్చి కేంద్ర ఎన్నికల సంఘంపై తనదైన శైలిలో విమర్శల బాణాలు సంధించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్‌డిఏ ప్రభుత్వం వత్తిడికి లోనైందని ఆయన దుయ్యబట్టారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటనను ఆలస్యం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సెలవు తీసుకుందని చిదంబరం విమర్శించారు. మోదీ గుజరాత్‌లో ఇటీవల జరిపిన బహిరంగ సభలో రాష్ట్ర శాసన సభల ఎన్నికల తేదీలను ప్రకటించేందుకు ఎన్నికల సంఘం వీలు కల్పించిందన్నారు. శాసన సభ ఎన్నికల తేదీలను తమకు తెలియజేసే అధికారాన్ని కూడా ఎన్నికల సంఘం మోదీకి కట్టబెట్టిందంటూ చిదంబరం వ్యంగ్యంతోపాటు పరుషంతో కూడిన ట్వీట్లు చేశారు. గుజరాత్ ప్రభుత్వం ప్రజలకు పలు రాయితీలు, తాయిలాలు ప్రకటించిన అనంతరం విరామంలో ఉన్న ఇసిని వెనకకు రప్పిస్తారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ‘ఎన్నికల షెడ్యూలును ప్రకటించిన మరుక్షణం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుంది. ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తే గుజరాత్ ప్రభుత్వం ప్రజలకు జనాకర్షణ పథకాలు, తాయిలాలు ప్రకటించలేదు.