జాతీయ వార్తలు

అమల్లోకొచ్చిన వికల్ప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: రైళ్లలో వెయిటింగ్ లిస్టులో ఉండి బెర్త్‌లు ఖరారుకాని ప్రయాణికుల కోసం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన వికల్ప్ విధానం అమలులోకి వచ్చింది. బెర్తులు దక్కని ప్రయాణికుల కోసం సోమవారం నుంచి ప్రత్యామ్నయ రైళ్ల సదుపాయం కల్పిస్తున్నారు. ఐదు ప్రధాన రూట్లయిన హౌరా, ముంబయి, చెన్నై, బెంగళూరు, సికింద్రాబాద్‌లో తొలుత అమలు చేస్తున్నారు. ఈ సదుపాయం మెయిల్/ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలోనే లభ్యమవుతుంది. రాజధాని, శతాబ్ది, దురంతోల్లో వికల్ప్ సదుపాయం ఉండదు. ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే వికల్ప్ ఆప్షన్ చూపుతుంది. బెర్తులు ఖరారుకాని సందర్భంలో ప్రత్యామ్నాయ సదుపాయానికి సిద్ధమంటూ చాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో మంత్రి సురేష్ ప్రభు వికల్ప్ పథకాన్ని ప్రకటించారు. ఒకసారి వికల్ప్ కింద బెర్తు ఖరారైతే మార్చుకోడానికి(మోడిఫై) చేసుకోవడాన్ని అనుమతించరు. అలాగే అదనపుచార్జీలు వసూలు చేయరు. చార్జీల్లో తేడాలున్నప్పటికి ఎలాంటి రిఫండ్ ఉండదు. వికల్ప్ సదుపాయాన్ని ఢిల్లీ- హౌరా, ఢిల్లీ- ముంబయి, ఢిల్లీ- చెన్నై, ఢిల్లీ- బెంగళూరు, ఢిల్లీ-సికింద్రాబాద్ మధ్య కల్పించారు. ఈ సదుపాయం ఇప్పటికే ఢిల్లీ-జముయా, ఢిల్లీ-లక్నో సెక్టార్‌లో అమలవుతోంది.