జాతీయ వార్తలు

ప్రపంచం గుర్తించేలా చేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: సంస్కరణల అమలుతో వేగవంతమైన అభివృద్ధి సాధనకు మార్గ నిర్దేశనం చేసిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానికే దక్కుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నరేంద్ర మోదీ వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ, తమది గరిష్ట సంస్కరణల ప్రభుత్వమని ప్రకటించారు. తనముందు ఇంకా అపరిమితమైన పని ఉందన్నారు. గరిష్ట సంస్కరణల అమలుతో భారత దేశాన్ని ప్రపంచం గుర్తించేలా చేయగలిగామని సగర్వంగా ప్రకటించుకున్నారు. భారతదేశం ఇప్పుడు గతంలో మాదిరిగా ఒక మూలకు పరిమితం కాలేదని నరేంద్ర మోదీ వెల్లడించారు. తాను ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి భారతదేశం అంతర్జాతీయ వ్యవహారాల్లో ముఖ్యపాత్ర నిర్వహిస్తోందని మోదీ అన్నారు. అమెరికాతో పటిష్టమైన సంధానాలు ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు. ఎన్డీయే వేగవంతమైన పెరుగుదల మార్గాన్ని ఏర్పాటు చేసింది. ఇకమీదట రాష్ట్రాల సహాయంతో ముందుకు సాగిపోవటమే తరువాయి అని ప్రధాని పేర్కొన్నారు. గరిష్ట సంస్కరణలతో ఇప్పటికే ఎంతో చేశాం. ఇకమీదట చేయాల్సింది కూడా ఎంతో ఉందన్నారు. అవినీతి అరికట్టాం. గ్రామీణ వౌలిక సదుపాయాల్లోని లోపాలు సరిదిద్దాం. వ్యాపారాలకు అత్యంత సులువైన వాతావరణాన్ని నెలకొల్పటంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ తలుపులను విదేశీ పెట్టుబడుల కోసం తెరిచామని వివరించారు. సరుకులు, సేవల పన్నుల బిల్లుకు ఈ ఏడాది పార్లమెంటు ఆమోద ముద్ర పడుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తూ, సంస్కరణల అమలుకు తాను మధ్యేమార్గాన్ని అనుసరిస్తున్నట్టు మోదీ వెల్లడించారు. మధ్యేమార్గాన్ని అనుసరిస్తున్నందుకే ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలను విక్రయించటం లేదని మోదీ స్పష్టం చేశారు.
పబ్లిక్ రంగంలోని సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తాయన్నది తన విశ్వాసమని అన్నారు. పబ్లిక్‌రంగ సంస్థల్లో కనిష్ఠ ప్రభుత్వ వాటా విక్రయంలో ఆశించిన పురోగతి ఉందన్నారు. గతంలో ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న రంగాల్లో ప్రైవేట్ యాజమాన్యాల పాత్ర పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశంలో పబ్లిక్‌రంగ సంస్థలు, ప్రైవేట్‌రంగ సంస్థలు రెండింటికీ ముఖ్యమైన పాత్ర ఉన్నదంటూ, ఉన్నపళంగా ప్రభుత్వరంగ సంస్థలను తొలగించలేం, అలా చేయడం మంచిది కూడా కాదని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బిగ్ బ్యాంగ్ సంస్థలను అమలు చేయటంలో ఎన్డీయే సర్కారు విఫలమైందంటూ వస్తోన్న ఆరోపణలకు మోదీ సమాధానమిస్తూ తమ ప్రభుత్వం అమలు చేసే సంస్కరణలు ఇతర ప్రభుత్వాలకు సాధ్యమయ్యేది కాదని బదులిచ్చారు. బిగ్ బ్యాంగ్ సంస్కరణలంటే ఏమిటనేది ఎవ్వరూ నిర్వచించలేకపోయారని ఆయన చెప్పారు. ప్రధాని పదవి చేపట్టిన కొత్తలో తాను ఆర్థిక నిపుణులతో సమావేశమైనప్పుడు బిగ్ బ్యాంగ్ సంస్కరణలు ఏమిటనేది నిర్వచించాలని కోరానని, ఒక్క ఆర్థిక నిపుణుడు కూడా ఇది బిగ్ బ్యాంగ్ సంస్కరణ అని స్పష్టంగా చెప్పలేకపోయారని మోదీ చెప్పటం గమనార్హం. సరుకులు, సేవల పన్నుల చట్టం బిల్లు అమలులోకి వస్తే రకరకాల పన్నులన్నీ రద్దై ఒకే రకమైన పన్నుల విధానం అమలులోకి వస్తుందనీ, దీనివలన పరిశ్రమలు, వాణిజ్య రంగానికి ఎంతో మేలు జరుగుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. జిఎస్టీ మూలంగా దేశంలో వ్యాపార అనుకూల పన్నుల విధానం అమల్లోకి వస్తుందన్నారు.