జాతీయ వార్తలు

వైద్యుల పదవీ విరమణ 65 ఏళ్లకు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహరాన్‌పూర్, మే 26:దేశంలో వైద్య సేవల కొరత తీవ్రంగా ఉన్న దృష్ట్యా ప్రభుత్వ డాక్టర్ల పదవీ విరమణ వయోపరిమితిని 65 సంవత్సరాలకు పెంచుతున్నామని ప్రధాని మోదీ గురువారంనాడిక్కడ ప్రకటించారు. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రివర్గం వారంలోనే తన ఆమోదం తెలుపుతుందన్నారు. దేశ వ్యాప్తంగా వైద్యుల అవసరం తీవ్రంగా ఉన్నందున ఆ కొరతను ఇప్పటికిప్పుడే తీర్చడం సాధ్యం కాదని, అందుకే వైద్యుల రిటైర్మెంట్ వయస్సును 65 సంవత్సరాలకు పెంచుతున్నామని తెలిపారు.
వైద్యులు మరికొన్ని సంవత్సరాల పాటు పేదలకు సేవలందించేందుక వీలగా కేంద్ర, రాష్ట్రాల్లో వీరి రిటైర్మెంట్ వయస్సును 65 సంవత్సరాలకు పెంచడం ఎంతైనా అవసరమని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు..ఇంకొన్ని చోట్ల 62 సంవత్సరాలు ఉందని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
దేశంలో సరిపడ పరిమాణంలో వైద్య సంస్థలు ఉంటే వైద్యుల కొరతను భర్తీ చేసుకనే అవకాశం ఉంటుందని చెప్పిన ప్రధాని రెండేళ్లలోవీరి కొరతను తీర్చడం సాథ్యం కాదన్నారు. రాష్ట్రాల్లోనూ, కేంద్ర ప్రభుత్వంలోనూ పని చేస్తున్న వైద్యుల పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయించామన్నారు. మరి కొంత మంది వైద్యులు అందుబాటులోకి వచ్చేందుకు వీలుగా దేశంలో వైద్య కళాశాలలను మరింతగా పెంచుతున్నామన్నారు. ప్రతి నెల్లో తొమ్మిదో తేదీన పేద గర్భిణిలకు ఉచితంగా సేవలందించాలని..దీని వల్ల పేదలు అస్వస్తతలకు గురి కాకూడదన్న తమ ప్రభుత్వ లక్ష్యానికి మరింత బలం చేకూరుతుందని మోదీ తెలిపారు.