జాతీయ వార్తలు

‘ఆసియాన్’తో మరింత బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 11: ఫిలిప్పీన్స్‌లో ఆదివారం నుంచి తాను జరపబోయే పర్యటన ‘ఆసియాన్’ (ఆగ్నేయాసియా దేశాల కూటమి)తో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘ఆసియాన్’ సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఆదివారంనాడు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా చేరుకుంటారు. తన పర్యటన వల్ల ఫిలిప్పీన్స్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు మరింత బలం చేకూరుతుందని, ‘ఆసియాన్’ సభ్య దేశాలతో రాజకీయ భద్రత, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో మెరుగైన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మూడు రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరేముందు ప్రధాని ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఆసియాన్’, ‘ఈస్ట్ ఆసియా’ సదస్సులతో పాటు పలు అంతర్జాతీయ వేదికలపై ఆయన ప్రముఖులను కలుసుకుని చర్చలు జరుపుతారు. ‘ఆసియాన్’ 50వ వార్షికోత్సవాల్లో, ఆర్‌సిఇపి (ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం) నేతల భేటీలో, ఆసియాన్ వాణిజ్య, పెట్టుబడుల సదస్సులో మోదీ పాల్గొంటారు. ఈ సదస్సుల్లో తాను పాల్గొంటున్నందున ‘ఆసియాన్’, ఇండో-పసిఫిక్ ప్రాంతం, ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ వంటి అంశాలతో భారత్ కృషిని, ఆకాంక్షలను వ్యక్తం చేసే అవకాశం కలుగుతుందన్నారు. ఫిలిప్పీన్స్‌లోని భారతీయులను కలుసుకునేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్లు మోదీ తెలిపారు. ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రాన్ని, మహావీర్ ఫిలిప్పీన్స్ ఫౌండేషన్, ఇతర సంస్థల్లో జరిగే పరిశోధనలు, సేవల గురించి తన పర్యటనలో తెలుసుకుంటానని తెలిపారు. మనీలాలోని వివిధ పరిశోధనా సంస్థల్లో భారతీయులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారని ఆయన గుర్తుచేశారు. అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ‘దక్షిణ ఆసియా ప్రాంత కేంద్రా’న్ని వారణాసిలో ఏర్పాటు చేసేందుకు తన మంత్రివర్గం గత జూలై 12న ఆమోదం తెలిపినట్లు మోదీ తన ‘ఫేస్‌బుక్’ ఖాతాలో తెలిపారు. ఫిలిప్పీన్స్‌కు ఆవల ఏర్పాటవుతున్న తొలి వరి పరిశోధనా కేంద్రం ఇదే అవుతుందని పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగొ డుటెర్టెతో, ఇతరులతో జరిపే చర్చల్లో ఆర్థిక, పారిశ్రామిక, సాంస్కృతిక రంగాల్లో సహకరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. మహావీర్ ఫిలిప్పీన్స్ ఫౌండేషన్‌ను సందర్శించినపుడు మన దేశానికి చెందిన ‘జైపూర్ ఫుట్’ ఘనతను వివరిస్తానని మోదీ తెలిపారు. కాళ్లు లేనివారికి అవసరమయ్యే ‘జైపూర్ ఫుట్’లను ఇప్పటికే పెద్దసంఖ్యలో ఈ ఫౌండేషన్‌కు భారత్ అందజేసింది. ‘ఆసియాన్’ సదస్సులో భారత్‌సహా ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌ల్యాండ్, బ్రూనై, కంబోడియా, లావోస్, మయన్మార్, వియత్నాం నేతలు పాల్గొంటారు. ‘ఈస్ట్ ఆసియా’ సదస్సుకు భారత్, చైనా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యా నేతలు హాజరవుతారు.