జాతీయ వార్తలు

సమాజాన్ని చీల్చడంలో ఘనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 11: అభివృద్ధి పేరుతో ప్రజల్లో విద్వేష భావాన్ని పెంపొందించడంలో యుపి ప్రభుత్వం తనకు తానే సాటి అని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దుయ్యబట్టారు. సమాజాన్ని రెండుగా చీల్చడంలో బిజెపి నాయకులను మించినవారు లేరని ఆయన ఆరోపించారు. మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మళ్లీ శంకుస్థాపనలు చేయడం సిగ్గుచేటని అన్నారు. సమస్యలను ఎగదోయడంలోనూ, ద్వేషభావాన్ని విస్తృతం చేయడంలోనూ, సమాజంలో చీలిక తేవడంలోనూ బిజెపి నాయకులను మించినవారు లేరని, అది ఒక కుటుంబమైనా, రాజకీయ పార్టీ అయినా వారికి ఒకటేనని అఖిలేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హిందూ-ముస్లిం పేరుతోగానీ, కులం పేరుతో గానీ చీలిక తేవడంలో వారికన్నా మించినవారు ఇంకెవరున్నారని, ఈ విషయంలో వారు ఉద్దండులని విమర్శించారు. గతంలో శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులనే యోగి సర్కార్ అభివృద్ధి పేరుతో మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారని, వారు సొంతంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులకు తాను ఏనాడూ మళ్లీ శంకుస్థాపనలు చేయలేదని అన్నారు. సమాజ్‌వాది పార్టీలోనూ, తన కుటుంబంలో నెలకొన్న సంక్షోభం సమసిపోయిందని, అధికారం కోల్పోవడంతో అలకలు కూడా తొలగిపోయాయని అఖిలేష్ వ్యాఖ్యానించారు. అధికారం లేకపోతే అవేవీ ఉండవన్నారు. యుపి అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌తో కుదుర్చుకున్న పొత్తు కొనసాగుతుందని, రాహుల్‌గాంధీతో ఏర్పడిన స్నేహం భవిష్యత్తులోనూ ఉంటుందని అన్నారు. స్నేహితులను మార్చే గుణం తనకు లేదనే విషయం అందరికీ తెలుసన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ ఆహ్వానించకపోవడంపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ, అది అంత ముఖ్య విషయం కాదన్నారు. నా పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తరఫున ప్రచారం జరిపేందుకు తననెవరూ ఆపలేరని అన్నారు.