జాతీయ వార్తలు

మూడో రోజూ కొనసాగిన దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై/కడలూరు, నవంబర్ 11: పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే అనుమానంతో జైలు జీవితం గడుపుతున్న ఏఐఏడీఎంకే నాయకురాలు వికె శశికళ, ఆమె బంధువుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు వరుసగా మూడోరోజు శనివారం కూడా దాడులు నిర్వహించారు. బెంగళూరు, హైదరాబాద్ మెట్రో నగరాలతో పాటు తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. గురువారం ప్రారంభించిన ఈ దాడులు మూడోరోజూ కొనసాగాయని ఒక ఐటీ అధికారి తెలిపారు. ఈ దాడుల్లో ఎంత మొత్తంలో నగదు, ఏ రకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. కడలూరులో శనివారం పది మంది అధికారులతో కూడిన బృందం రెండు ఇళ్లు, ఒక బంగారం షాపులో సోదాలు నిర్వహించింది.

చిత్రం..జయ టీవీ కార్యాలయంలో సోదాలు జరుగుతుండటంతో బయటే వేచి చూస్తున్న ఆ సంస్థ సిఈవో తదితరులు