జాతీయ వార్తలు

కేరళలో ఆరెస్సెస్ కార్యకర్త హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిశూర్, నవంబర్ 12: బెయిల్‌పై బయటికొచ్చిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్యకు గురవ్వడం కేరళలో సంచలనం సృష్టించింది. త్రిశూర్ జిల్లా గురువయ్యూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త పి ఆనంద్‌ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మూడేళ్ల క్రితం వామపక్ష కార్యకర్త కాశిమ్ హత్య కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్న ఆనంద్, ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆనంద్ మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తుండగా, గుర్తు తెలియని వాహనంతో ఢీకొట్టిన దుండగులు పదునైన ఆయుధంతో తీవ్రగా గాయపర్చారని పోలీసులు వెల్లడించారు. ప్రాణాపాయ స్థితిలోవున్న ఆనంద్‌ను ఆస్పత్రికి తరలించేసరికే మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు. కేరళలో ఆరెస్సెస్ కార్యకర్తలు ఊచకోతకు గురవుతున్నారంటూ ఇటీవలే రాష్ట్ర బిజెపి పెద్దఎత్తున యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. మద్దతుగా అనేక రాష్ట్రాల్లో బిజెపి యాత్రలు నిర్వహించటం, కేరళలో నిర్వహించిన పదిహేను రోజుల యాత్రకు అటు పార్టీ చీఫ్ అమిత్ షా, ఇటు యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ సైతం హాజరయ్యారు. అయితే, యాత్ర ముగిసి నెల తిరగకుండానే మళ్లీ అరెస్సెస్ కార్యకర్త హత్యకు గురవ్వడం సంచలనం రేకెత్తిస్తోంది. ఇదిలావుంటే ఆనంద్ హత్య ఘటనపై ఇప్పుడే ఎలాంటి వివరాల చెప్పలేమని పోలీసులు అంటున్నారు. హంతకుల
కోసం దర్యాప్తు సాగిస్తున్నామని, ఈ హత్యకు రాజకీయ కోణం ఏమైనా ఉందా? లేదా? అన్న విషయాన్ని ఇప్పుడే నిర్థారించలేమని స్పష్టం చేశారు. సంఘటనా ప్రాంతంలో దొరికిన ఆధారాలతో కేసు దర్యాప్తు చేపట్టినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే, ఆరెస్సెస్ కార్యకర్త ఆనంద్ హత్యను బిజెపి చీఫ్ అమిత్ షా తీవ్రంగా ఖండించారు. ‘ఆరెస్సెస్ కార్యకర్త ఆనంద్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆరెస్సెస్ శ్రేణులపై దమనకాండను సాగిస్తున్న వామపక్ష కార్యకర్తలకు తగిన బుద్ధి చెప్పాలి. కేరళలో సాగుతోన్న రాజకీయ హత్యలను దేశం గమనిస్తోంది. రాష్ట్రంలో పేట్రేగిపోతున్న నేరస్తులను నియంత్రించేందుకు ప్రభుత్వం, సిఎం పినరయ్ ఏం చర్యలు తీసుకుంటున్నారో సమాధానం చెప్పాలి’ అంటూ ట్వీట్ చేశారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సుమారుగా 120మంది ఆరెస్సెస్ కార్యకర్తలు హత్యకు గురయ్యారంటూ బిజెపి ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే.

ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త పి ఆనంద్‌ (ఫైల్‌పొటో)