జాతీయ వార్తలు

ఉచిత వైఫై.. పింక్ టాయ్‌లెట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 12: ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆదివారంనాడు లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ‘సంకల్ప పత్రం’ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు ఉపముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ వౌర్య, దినేష్ శర్మ, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సురేష్ ఖన్నా, యూపీ బీజేపీ అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో వీటిని అత్యంత ప్రటిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 652 మున్సిపాలిటీలతోపాటు 16 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
సంకల్ప పత్రంలో 28 హామీలను గుప్పించారు. మంచినీటి సౌకర్యం కల్పించడం, వీధి లైట్లు, ఉచితంగా మరుగుదొడ్ల నిర్మాణం, మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ టాయ్‌లెట్ల ఏర్పాటు, గుర్తింపు పొందిన పబ్లిక్ ప్రాంతాల్లో ఉచితంగా వైఫై సౌకర్యం కల్పించడం వంటివి ఈ హామీల్లో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలే ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీనే గెలిపించాలని, అప్పుడే అన్ని సౌకర్యాలు సక్రమంగా, సకాలంలో ఏర్పాటు చేసుకునేందుకు వీలు కలుగుతుందని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

చిత్రం..‘సంకల్ప పత్రం’ విడుదల చేస్తున్న యూపీ సీఎం ఆదిత్యనాథ్ తదితరులు