జాతీయ వార్తలు

‘అయోధ్య’లో కేంద్రం జోక్యం లేదు: నఖ్వీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థలం సమస్య పరిష్కారానికి కేంద్రం అత్యుత్సాహం చూపిస్తోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తోసిపుచ్చారు. వివాద పరిష్కారానికి జరుగుతున్న చర్చల్లో కేంద్రం జోక్యం చేసుకుంటుందన్న కథనాలను మంగళవారం ఆయన ఖండించారు. అయోధ్య సమస్య పరిష్కారం కోసం కోర్టువెలుపల చర్చలు జరిగి, తనను కోరితే మధ్యవర్తిత్వం నెరపుతానని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ అధినేత శ్రీశ్రీ రవిశంకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ నెల 16న అయోధ్య వెళ్లి ఇరుపక్షాలతో మాట్లాతానని రవిశంకర్ చెప్పారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగానే స్పందించింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ చీఫ్ కేంద్రం ఏజెంట్ అని, వారి ప్రయోజనాలను కాపాడేందుకే ఆ ప్రకటన చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ‘రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోదు’ అని నఖ్వీ పేర్కొన్నారు.