జాతీయ వార్తలు

జెఎన్‌యు విద్యార్థుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 22న పోలీసులు విద్యార్థులపై జరిపిన లాఠీచార్జి, అరెస్టులకు వ్యతిరేకంగా తెలంగాణ భవన్ ముందు జెఎన్‌యూ విద్యార్థులు నిరసన చేపట్టారు. విద్యార్థులు, అధ్యాపకులపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున విద్యార్థులు నినాదాలు చేశారు. పోలీసుల చర్యను విశ్వవిద్యాలయాలుసహా దళిత విద్యార్థులపై దాడిగా నిరసనకారులు పేర్కొన్నారు. హెచ్‌సీయూలో అరెస్టు చేసిన విద్యార్థులు, అధ్యాపకులను వెంటనే విడుదల చేయాలని, వర్శిటిలో ఉన్న పోలీసులను వెనక్కి పంపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయంలో నియమాలకు విరుద్ధంగా పోలీసులు ప్రవేశించారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యార్థులపై దాడులపై కనీసం స్పందిచలేదని, విద్యార్థులకు కనీస సౌకర్యలు ఇవ్వకపోవడం దురదృష్టకరం అని విద్యార్థులు అన్నారు.