జాతీయ వార్తలు

కృష్ణా ట్రిబ్యునల్‌లో కొనసాగుతున్న వాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: కృష్ణానదీ జలాల పంపకాలపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఏపీ తరపు సాక్షిగా ఉన్న కెవి సుబ్బారావును తెలంగాణ తరపు న్యాయవాది వి.రవిందర్‌రావు వరుసగా రెండోరోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. డెల్టాలో వర్షంవల్ల ప్రకాశం బ్యారేజీ ఎగువన మాత్రమే సాగుకు వినియోగిస్తారని, ఆ ప్రాంతంలో కాలువల ద్వారా వచ్చే నీటిని వినియోగించరని సుబ్బారావు వివరించారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా పాలర్, పొన్నిర్ నదీ బేసిన్‌లకు కృష్ణా జలాలను మళ్లిస్తున్నారు కదా? అని తెలంగాణ తరపు న్యాయవాది ప్రశ్నించగా అది నిజమేనని, కృష్ణా నదిలో మిగుల జలాలను మాత్రమే హంద్రీనీవాలో వినియోగిస్తున్నట్టు ఏపీ సాక్షి సుబ్బారావు సమాధానం ఇచ్చారు. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.