జాతీయ వార్తలు

మోదీకి తిరుగేలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజాదరణ నానాటికీ పెరుగుతున్నదనడానికి అమెరికా సంస్థ ‘ప్యూ’ నివేదికే తార్కాణమని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో మోదీకి తిరుగులేదని, ప్రజల్లో ఆదరణ ఎక్కడా తగ్గలేదని ఆ సంస్థ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన అమిత్ షా ‘ప్రతి పదిమందిలో ఎనిమిది మంది ప్రధాని మోదీ పాలనపై అమితమైన విశ్వాసాన్ని కనబరిచారు. ఆయన సమర్థతకు ఇది కొలమానం’ అని అన్నారు. పెద్దనోట్లను రద్దుచేస్తూ గత నవంబర్‌లో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని యావత్‌దేశం సమర్థించిందని ఆయన పేర్కొన్నారు. ‘నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఏర్పడింది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. జాతిని ఒకే తాటిపైకి తీసుకురాగల సత్తాఉన్న నేత మోదీ అని ప్రజలు నమ్ముతున్నారు’ అని ఫ్యూ వెల్లడించింది. దేశ రాజకీయ నాయకుల్లో మోదీ అత్యంత ప్రజాదరణ ఉన్న నేత అని అమిత్ షా చెప్పారు. దేశం నలుదిక్కులా ఆయన పేరు, ప్రతిష్ఠలు వ్యాపించాయని షా ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 వరకూ 2,464 మంది అభిప్రాయాలు సేకరించిన అమెరికా సంస్థ మోదీకి జనాదరణ తరగలేదని వెల్లడించింది. అలాగే జాతీయ ప్రెస్ దినోత్సవం సందర్భంగా మీడియా వర్గాలకు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు.