జాతీయ వార్తలు

అమరావతికి పచ్చజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి జాతీయ హరిత ధర్మాసనం (ఎన్జీటీ) పచ్చజెండా ఊపింది. పర్యావరణ శాఖ 2015 అక్టోబర్ 9న ఇచ్చిన పర్యావరణ అనుమతులు కొట్టివేసేందుకు తిరస్కరించింది. అయితే ఆ శాఖ తమ అనుమతితో విధించిన 90 షరతులను తు.చ తప్పకుండా పాటించాలని ధర్మాసనం ఆదేశించింది. నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలంటూ 2015లో పండలనేని శ్రీమన్నారాయణ, ఎ. కమలాకర్‌లు సుప్రీం కోర్టులో కేసు వేయటం తెలిసిందే. ఎన్జటీ ట్రిబ్యునల్ చైర్మన్ స్వతంత్రకుమార్, న్యాయమూర్తులు రాఘవేంద్ర రాథోర్, బిక్రంసింగ్ సజ్వన్‌లు శుక్రవారం తీర్పు ప్రకటించారు. పర్యావరణ శాఖ విధించిన 90 షరతులు సక్రమంగా అమలు జరుగుతున్నాయా? లేదా? అనేది పరిశీలించేందుకు రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ఒకటి అమలు కమిటీ, రెండోది పర్యవేక్షణ కమిటీ. ప్రతినెలా సమావేశమై ఎన్జటీ తీర్పు అమలును పరిశీలించి నివేదికను పర్యవేక్షణ కమిటీకి అందచేస్తుంది. పర్యవేక్షణ కమిటీ ప్రతి మూడు నెలలకోసారి సమావేశమై అమలు కమిటీ నివేదికలను అధ్యయనం చేస్తుంది. ఈ కమిటీ ప్రతి ఆరు నెలలకోసారి తమ నివేదికను గ్రీన్ ట్రిబ్యునల్‌కు సమర్పిస్తుంది. పర్యవేక్షణ కమిటీలో పర్యావరణ, అటవీ శాఖ అదనపు కార్యదర్శి (చైర్మన్), ఆంధ్ర ప్రభుత్వం పర్యావరణ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి, ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఉన్న జాతీయ హైడ్రాలజీ సంస్థ సీనియర్ సైంటిస్ట్, బెంగళూరులోని ఇండియన్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ సైంటిస్టు, ఏపీ కాలుష్య నివారణ సంఘం సభ్య కార్యదర్శి, పూణే వర్శిటీ జియాలజీ విభాగం ప్రొఫెసర్ ఎన్‌జె పవార్ సభ్యులుగా ఉంటారు. అమలు కమిటీలో ఏపీ ప్రభుత్వం పర్యావరణ, అటవీ శాఖ అదనపు కమిషనర్ చైర్మన్‌గా వ్యవహరిస్తే, మరో నలుగురు సభ్యులు ఉంటారు. పర్యావరణ శాఖ విధించిన 90 షరతులు, నిబంధనలను ఉల్లఘించకుండా చూసేందుకు గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు కోట్ల బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటుంది. షరతులను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించే పక్షంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ఐదు కోట్ల రూపాయలను జప్తు చేస్తుంది. వరద ముంపు ప్రాంతాల్లో ఎలాంటి మార్పులనైనా అధ్యయనం తరువాతే చేయాల్సి ఉంటుందని గ్రీన్ ట్రిబ్యునల్ తన తీర్పులో స్పష్టం చేసింది. నదీమార్గం, వరద జలాల రీతిలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయకూడదని ఆదేశించింది. అమరావతి నగరానికి వరద ముంపు నుంచి రక్షణ కల్పించేందుకు తప్ప ఇతర ఎలాంటి పరిస్థితుల్లోనూ కరకట్టల్లో మార్పులు చేర్పులు చేయకూడదని ఎన్జటీ తన తీర్పులో స్పష్టం చేసింది. ఇది కూడా పూర్తి అధ్యయనం తరువాతే చేయాలని ఆదేశించింది. చెత్తా చెదారం తదితర వ్యర్థాలను ప్రారంభ దశలోనే విడదీయాలని ట్రిబ్యునల్ సూచించింది. వర్షాన్ని పొదుపు చేయటం, సౌర విద్యుత్తు వినియోగం తదితర అంశాలకు సంబంధించిన భవన నిబంధనలు ముందే ప్రకటించాలని సూచించింది. కార్బన్ న్యూట్రాలిటీని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు కార్యచరణ
పథకాన్ని రూపొందించాల్సి ఉంటుంది. కొండవీటి వాగు, దాని కాలువల ప్రాంతంలో ఉన్న కొండలు, గుట్టలను పరిరక్షించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో చెట్ల పెంపకాన్ని చేపట్టాలని గ్రీన్ ట్రిబ్యునల్ తన తీర్పులో పేర్కొంది. రాజధాని నగంలో ప్రస్తుతం ఉన్న 251 ఎకరాల అటవీ ప్రాంతాన్ని యథాతథంగా ఉంచాలని, దీనిని అటవీయేతర పనులకు మళ్లించకూడదని ఆదేశించింది. అమలు కమిటీ కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన మొత్తం ప్రాజెక్టు సమగ్ర అధ్యయనం చేపట్టాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. పర్యావరణానికి సంబంధించిన జల, అటవీ, చిన్న చిన్న ప్రవాహాలు, తడి భూములు, కాలుష్య నివారణ చర్యలను ఈ కమిటీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీ అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు షరతులను విధించవచ్చని ఎన్జటీ తన తీర్పులో స్పష్టం చేసింది.