జాతీయ వార్తలు

ప్రాణం తీసిన పాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మే 31: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మంగళవారం పెను విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నవాగఢ్ బ్లాక్‌లోని కేతుల్‌నార్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో పాలు తాగిన చిన్నారుల్లో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో ఛత్తీస్‌గఢ్ సర్కారు ఉలిక్కిపడింది. అస్వస్థతకు గురైన చిన్నారులను నవాగఢ్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.
వారికి అత్యవసర వైద్యం కోసం ఎంత ఖర్చైనా భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ప్రకటించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు దేవ్‌భోగ్ కంపెనీ పాలను సరఫరా చేస్తోంది. మృతుల కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.10వేలు చొప్పున ప్రభుత్వం అందించింది.

చిత్రం నవాగఢ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు.
చిన్నారుల పాలిట శాపంగా మారిన పాలు ఇవే