జాతీయ వార్తలు

పెరిగిన నగదు రహిత లావాదేవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు భారీస్థాయిలో పెరిగినట్టు యూరప్‌కు చెందిన వరల్డ్‌లైన్ సంస్థ అధ్యయనంలో వెల్లడించింది. నోట్ల రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలువల్ల దేశంలో డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇతర డిజిటల్ చెల్లింపులతో కూడిన లావాదేవీలు పెరిగాయని ఆ సంస్థ పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల అధారంగా వరల్డ్‌లైన్ సంస్థ అధ్యయనంలో గత ఏడాది సెప్టెంబర్‌తో పొలిస్తే 2017 సెప్టెంబరు నెలలో 84 శాతం నగదు రహిత లావాదేవీలు పెరిగినట్టు చెప్పింది. గత ఏడాది సెప్టెంబరులో డెబిడ్, క్రెడిట్ కార్డుల ద్వారా రూ.40,130కోట్ల విలువైన 20,030లక్షల లావాదేవీలు జరగ్గా, ఈ ఏడాది అదేనెలలో రూ.74,090కోట్ల విలువైన 37,080 లక్షల లావాదేవీలు జరిగినట్టు వివరించింది. పెద్దనోట్ల రద్దు అనంతరం రోజువారి అవసరాలకోసం ప్రజలు నగదు రహిత లావాదేవీలకు పెద్దమొత్తంలో డిజిటల్ చెల్లింపులు మొదలు పెట్టినట్టు చెప్పింది. అలాగే నగదు అందుబాటులోకి వచ్చిన ప్రజలు నగదు రహిత లావాదేవీలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆ సంస్థ వివరించింది. దేశవ్యాప్తంగా నోట్ల రద్దుకు ముందున్న స్థాయిలో నగదు లావాదేవీలు భారీగా తగ్గినట్టు అధ్యయనం వెల్లడించింది. త్రీజీ, ఫోర్‌జీ మొబైల్ సేవలు అందుబాటులోకి రావడంతోద్వారా బ్యాంక్ అకౌంట్ యుపిఐ నెంబరుతో కూడిన లావాదేవీలకు ప్రజలు అలవాటు పడినట్టు ఆ సంస్థ విశే్లషించింది.