జాతీయ వార్తలు

జరిమానా కట్టాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 31: ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌కు చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు గ్రీన్ ట్రిబ్యునల్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల తాము మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం వల్ల ఢిల్లీలోని యమునా నది ఒడ్డుకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదంటూఆ సంస్థ చేసిన వాదనను తిరస్కరించిన గ్రీన్ ట్రిబ్యునల్, నష్టపరిహారంగా చెల్లించాల్సిన మిగతా 4.75 కోట్లు చెల్లించాలని మంగళవారం ఆదేశించింది. ఈ రోజు సాయంత్రం 7 గంటల్లోగా ఆ జరిమానా సొమ్మును డిపాజిట్ చేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది. అంతేకాదు, జరిమానా చెల్లించాలన్న షరతుపైనే తాము ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు యమునా నది ఒడ్డున ఈ సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహించడానికి అనుమతిచ్చినట్లు కూడా బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ సమ్మేళనం ముగిసిన తర్వాత దాని ప్రభావాన్ని తప్పుగా అంచనా వేశారని వాదిస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు ఇది గట్టి ఎదురుదెబ్బేనని చెప్పాలి. కాగా, ఈ పరిణామంపై రవిశంర్ స్పందిస్తూ, సమ్మేళనం కారణంగా పర్యావరణ హాని జరిగిందన్న వాదనలు అర్థం లేనివని కొట్టి పారేశారు. అంతేకాదు ట్రిబ్యునల్ ఆదేశాన్ని సవాలు చేస్తామని కూడా ఆయన చెప్పారు.
ప్రపంచ సాంస్కృతిక సమ్మేనం కారణంగా యమునా నది ఒడ్డుకు జరిగిన పర్యావరణ హానికి గాను ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థపై రూ. 120 కోట్ల జరిమానా విధించాలని ఇంతకు ముందు గ్రీన్ ట్రిబ్యునల్‌కు చెందిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అయితే తమది లాభార్జన లేని స్వచ్ఛంద సంస్థ అని, అందువల్ల జరిమానా చెల్లించలేమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాదించింది. దీంతో రూ. 5 కోట్ల మధ్యంతర జరిమానా చెల్లించాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే డిపాజిట్ చేసిన రవిశంకర్ మిగతా జరిమానా చెల్లించడానికి నిరాకరిస్తూ, జైలుకువెళ్లడానికైనా సిద్ధమేనని ప్రకటించారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఏర్పాటయిన 35 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఢిల్లీలోని యమునా నది ఒడ్డుపై గత మార్చి 11నుంచి 13వరకు మూడు రోజుల పాటు భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం తెలిసిందే.