జాతీయ వార్తలు

ప్రమాదకర గేమ్‌లపై అవగాహన కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: బ్లూవేల్ లాంటి ప్రమాదకర గేమ్‌లపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల ప్రవర్తలో విపరీత ప్రవర్తనకు దారితీసుకున్న గేమ్‌లపై అప్రమత్తత అవసరమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖాన్వికర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. పాఠశాల విద్యార్థుల్లో అవగాహనకు చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సంబంధిత విభాగాలు చర్యలు తీసుకోవాలని బెంచ్ ఆదేశించింది. అలాంటి గేమ్‌ల వల్ల సంభవిస్తున్న దుష్ప్రభావం, తీసుకోవల్సిన జాగ్రత్తలను దేశంలోని అన్ని పాఠశాలకు తెలియజేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖకు కోర్టు స్పష్టం చేసింది. బ్లూవేల్ గేమ్‌లకు అలవాటుపడిపోయిన పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడడంపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించడానికి కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ తాత్కాలిక నివేదికను న్యాయస్థానానికి అందజేసింది. పిల్లల బంగారు భవిష్యత్‌ను నాశనం చేస్తున్న బ్లూవేల లాంటి ఆన్‌లైన్ గేమ్స్‌కు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించేలా ఆదేశించాలంటూ న్యాయవాది స్నేహ కలిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. విద్యార్థులను ఈ దురలవాటు నుంచి దూరం చేయడానికి పది నిముషాల నిడివిగల విద్యా కార్యక్రమం ప్రసారం చేయాలని అక్టోబర్ 27న సుప్రీం కోర్టు దూరదర్శన్‌కు సూచించింది. అన్ని కార్యక్రమాలంతో పాటు విద్యకు సంబంధించిన ప్రోగ్రామ్‌లు ప్రసారం చేయాలని ప్రైవేటు టీవీ చానల్స్‌కు స్పష్టం చేసింది.