జాతీయ వార్తలు

డ్రగ్స్ నివారణకు తీసుకున్న చర్యలేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాల వ్యాప్తి నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో వివరాలను వెల్లడించాలని సుప్రీం కోర్టు కేంద్ర హోంశాఖను ఆదేశించింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పటిస్తోందని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, డ్రగ్స్ నియంత్రణకోసం గతంలో అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు బేఖాతరయ్యాయని కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. కేంద్ర మానవ వనరుల శాఖ సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌పై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తుందని, దాన్నికూడా ఈ కేసులో పార్టీగా చేయాలని కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాది బాలసుబ్రమణ్యం కోర్టు దృష్టికి తీసుకురాగా, దానికి అంగీకరించిన న్యాయస్థానం కేంద్ర హోంశాఖను ఈ కేసులో పార్టీగా చేర్చింది. పిటిషనర్ లేవనేత్తిన అంశాలపై తగిన సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. అలాగే ఈ కేసులో పార్టీగా ఉన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శిని తప్పించాలని కోరిన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. తదుపరి విచారణను డిసెంబరు 4వ తేదీకి వాయిదా వేసింది.