జాతీయ వార్తలు

పరిష్కరించాల్సింది కోర్టులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, నవంబర్ 20: అయోధ్యలోని రామాలయ వివాదాన్ని కేవలం కోర్టులు మాత్రమే పరిష్కరించగలుగుతాయని బిజెపి సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి సోమవారం ఇక్కడ స్పష్టం చేశారు. వచ్చే ఏడాదిలోనే అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు మొదలుకాగలవన్న ధీమాను కూడా ఆయన వ్యక్తం చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపక అధినేత శ్రీశ్రీ రవిశంకర్ అయోధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు చేపడుతున్న చర్యలు స్వాగతించదగ్గవేనని, ఇరు మతాల మధ్య సామరస్యానికి ఇవి దోహదపడతాయన్నారు. కానీ, అంతిమంగా ఈ వివాదాన్ని పరిష్కరించాల్సింది న్యాయస్థానాలేనని స్వామి తేల్చిచెప్పారు. జైపూర్ డైలాగ్ ఫోరంలో మాట్లాడిన ఆయన, వచ్చే దీపావళి నాటికి అయోధ్యకు చేరుకునేందుకు ప్రజలు సిద్ధం కావాలన్నారు. డిసెంబర్ మొదట్లోనే అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ మొదలై, ఏప్రిల్ నాటికి ముగుస్తుందని తెలిపారు. ఆగస్టుకల్లా సుప్రీం కోర్టు దీన్ని పరిష్కరించే అవకాశం ఉందన్న సంకేతాలు కూడా స్వామి అందించారు. ఈ కోర్టు పోరాటంలో హిందువులదే అంతిమ విజయం కాగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేసిన సుబ్రహ్మణ్యస్వామి, కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆలయ నిర్మాణ పనులు మొదలవుతాయన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ నేతలు పాల్పడిన అవినీతి కారణంగా కోర్టులు వారికి శిక్షలు వేస్తూ తీర్పులు ఇస్తున్నాయని స్వామి తెలిపారు. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ చేస్తున్న ప్రచారానికి మద్దతిస్తున్నానని వెల్లడించిన స్వామి, లవ్ జిహాద్ విషయంలో నిరంతర అప్రమత్తత ఎంతో అవసరమని తెలిపారు.