జాతీయ వార్తలు

ఉద్రిక్తతలపై దృష్టిపెట్టాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: చారిత్రక ఇతివృత్తం ఆధారంగా నిర్మించిన పద్మావతి చిత్రానికి సంబంధించి చెలరేగుతున్న వివాదాలపై కేంద్రం దృష్టిపెట్టిందని సీనియర్ అధికారులు సోమవారం ఇక్కడ స్పష్టం చేశారు. ఈ వివాదాల కారణంగా సినిమా విడుదలను నిర్మాతలు వాయిదా వేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించి తాజా పరిస్థితిపై ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి నివేదిక అందలేదని తెలిపారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో చెలరేగుతున్న ఉద్రికత్తలపై హోమ్ మంత్రిత్వశాఖ దృషి పెట్టిందన్నారు. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వాలే ఇలాంటి పరిస్థితుల నివారణకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నాయని, అదనపు దళాలు పంపాలని ఏ రాష్టమ్రూ తమను కోరలేదని హోమ్‌మంత్రిత్వశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. చరిత్రను వక్రీకరించారంటూ పద్మావతి నిర్మాత భన్సాలీపై రాజస్థాన్, యూపీలోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు తలెత్తిన విషయం తెలిసిందే.
జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం
పద్మావతి చిత్ర కథానాయిక దీపికా పదుకొనె, దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తలలు నరిగితే పది కోట్లిస్తామని హర్యానా బీజేపీ నేత సూరజ్‌పాల్ అము చేసిన ప్రకటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర స్వరంతో స్పందించింది. వెంటనే ఈ హెచ్చరికలపై దృష్టిపెట్టాలని హర్యానా డీజీపీని ఆదేశించింది. ఈ వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన కథనాలను పరిగణలోకి తీసుకున్న తాము హర్యానా డిజిపికి ఈ ఆదేశాలు జారీ చేశామని కమిషన్ వెల్లడించింది.
నిబంధల ప్రకారమే నిర్ణయం: సెన్సార్ బోర్డు
ముంబయి: పద్మావతి చిత్రానికి ఎటువంటి జాప్యం లేకుండా క్లియరెన్స్ ఇవ్వాలంటూ చిత్ర నిర్మాతలు చేసిన అభ్యర్థను సెన్సార్ బోర్డు తిరస్కరించింది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను పరిశీలించిన తరువాతే బోర్డు నియమ, నిబంధన ప్రకారమే వీరి అభ్యర్థను పరిశీలిస్తామని తెలిపింది. దరఖాస్తు అసంతృప్తిగా ఉండంతో ధృవీకరణ పత్రం ఇవ్వడానికి సీబీఎఫ్‌సీ నిరాకరించింది. ధృవీకరణ రాకుండానే మీడియాకు చిత్రాన్ని ప్రదర్శించడంపై సెన్సార్ బోర్డు చైర్‌పర్సన్ ప్రసూన్ జోషీ రెండు రోజుల క్రితం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇది సరైన విధానం కాదని, ఎవరి సెంటిమెంట్లనూ గాయపరచకూడదని ఆయన అన్నారు. అన్ని నిబంధనలు పరిగణలోకి తీసుకున్న తరువాతే బోర్డు ఓ నిర్ణయానికి వస్తుందని స్పష్టం చేశారు.
సారీ చెప్పండి: బీజేపీ ఆదేశం
న్యూఢిల్లీ: నటి పదుకొనె, దర్శకుడు భన్సాలీ తలలకు వెలకట్టిన బిజెపి నేతపై ఆ పార్టీ తీవ్రంగా మండిపడింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హెచ్చరికలకు తావులేదని పార్టీ పేర్కొంది. బిజెపి నేత సూరజ్‌పాల్ అము క్షమాపణ చెప్పాలని బీజేపీ ఆదేశించింది.‘రెచ్చగొట్టే వ్యాఖ్యలు పార్టీ నేతలు ఎవరూ చేసినా ఉపేక్షించం. అలాగే దర్శకుడు కూడా దేశ చరిత్రను కించపరిచేలా వ్యవహరించకూడదు’అని హర్యానా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అనిల్ జైల్ అన్నారు.
థియేటర్ వద్ద కర్ణిసేన బైఠాయింపు
బర్వానీ: పద్మావతిపై నిరసలు చల్లారలేదు. సంజయ్‌లీలా భన్సాలీ తీసిన చిత్రాన్ని నిషేధించాలంటూ ఆందోళన చేస్తున్న కర్ణిసేన సోమవారం మధ్యప్రదేశ్‌లోని ఓ థియేటర్ వద్ద గందరగోళం సృష్టించింది. అంజాద్ పట్టణంలోని ఓ థియేటర్‌లో పద్మావతి ట్రయల్ ప్రదర్శిస్తుండగా కర్ణిసేన కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. సినిమా మధ్యలో ట్రయల్ వేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వినోద్ థియేటర్ యజమాని ధర్మేంద్ర జైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన థియేటర్ వద్దకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
ఆ కుటుంబం ఆమోదం తప్పనిసరి
న్యూఢిల్లీ: మేవార్ కుటుంబం, చరిత్రకారులు అనుమతి ఇచ్చేవరకూ పద్మావతి చిత్రాన్ని విడుదల చేయొద్దని చత్తీస్‌గఢ్ బీజేపీ ఎంపీ సిపి జోషీ అన్నారు. ఈ మేరకు కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్ర సెన్సార్ బోర్డు చైర్‌పర్సన్ ప్రసూన్ జోషీకి ఎంపీ లేఖ రాశారు. చిత్రం విడుదలకు ముందు మేవార్ రాజ కుటుంబం, చరిత్రకారులకు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. దీపికా పదుకొనే పాత్ర చరిత్ర వక్రీకరణేనని ఆయన ఆరోపించారు.

చిత్రం..సోమవారం ముంబయలోని ఆజాద్ మైదానంలో ‘పద్మావతి’ చిత్రానికి వ్యతిరేకంగా
నినాదాలిస్తున్న అఖిల భారతీయ మరాఠా మహాసంఘ్, క్షత్రియ సంఘ్ కార్యకర్తలు