జాతీయ వార్తలు

కాంగ్రెస్ సీనియర్ నేత దాస్‌మున్షీ ఇకలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ప్రియరంజన్ దాస్‌మున్షీ సోమవారం కన్నుమూశారు. పక్షవాతంతో బాధపడుతున్న ఆయన ఎనిమిదేళ్లుగా కోమాలోనే ఉన్నారు. సమాచారం ప్రసార మంత్రిగా పనిచేసిన మున్షీకి 2008లో హార్ట్‌ఎటాక్ వచ్చింది. దీంతో పక్షవాతానికి గురై ఎనిమిదేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు. 1970-71లో పశ్చిమ బెంగాల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. మన్మోహన్‌సింగ్ సారథ్యంలోని యుపిఏ ప్రభుత్వంలో సమాచార ప్రసార మంత్రిగా సేవలందించారు. ఆయన హయాలో పలు విదేశీ చానళ్లపై నిషేధం విధించారు. అభ్యంతరంగా ఉంటున్నాయన్న కారణంతో ఏఎక్స్‌ఎన్, ఫ్యాషన్ టీవీలపై ఆంక్షలు విధించారు. 72 ఏళ్ల ప్రియరంజన్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. భార్య దీపికామున్షీ కూడా కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి. కుమారుడు ప్రదీప్ దేశ్‌ముఖ్.

చిత్రం..కాంగ్రెస్ నేత దాస్‌మున్షీ మృతదేహానికి నివాళులర్పిస్తున్న సోనియా