జాతీయ వార్తలు

ప్రజా విశ్వాసంలో మేటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతమైన ప్రజా విశ్వసనీయతను కలిగిన మూడో దేశంగా భారత్ అవతరించింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అత్యంత నమ్మకమైన ప్రభుత్వంగా ప్రపంచ దేశాల్లోనే మూడోస్థానాన్ని అందుకుందని తాజాగా ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఇసిడి) జరిపిన అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తిరుగులేని ప్రజా మద్దతు ఉందని, ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ మెజార్టీ భారత ప్రజలు విశ్వశిస్తున్నారని ఈ సర్వే స్పష్టం చేసింది. భారత దేశ జనాభాలో మూడొంతుల మంది ప్రజలు బిజెపి ప్రభుత్వంపై ఎనలేని విశ్వాసాన్ని కలిగి ఉన్నారని తాజా నివేదికను ఉటంకిస్తూ ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యుఇఎఫ్) స్పష్టం చేసింది. తాజాగా భారత ప్రభుత్వం చేపట్టిన అవినీతి వ్యతిరేక చర్యలో పన్నుల సంస్కరణ నిర్ణయాలను కూడా దేశ ప్రజలు పూర్తి మెజారిటీతో అంగీకరిస్తున్నారంటే, తమ జాతీయ ప్రభుత్వం పట్ల వారికున్న నమ్మకాన్ని స్పష్టం చేస్తోందని ప్రపంచ ఆర్థిక ఫోరం తెలిపింది. 130 కోట్లు దాటిన భారత జనాభాలో దాదాపు 74 శాతం మంది మోదీ ప్రభుత్వంపై పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఈ సర్వేలో వ్యక్తం చేశారని తెలిపింది. ఈ సర్వేపై స్పందించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి జెపి నడ్డా ‘2014 ముందువరకు ప్రభుత్వాలపైన, రాజకీయ నాయకులపైన ప్రజలకు విశ్వాసం ఉండేది కాదు. కానీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చర్యల వల్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఏ ప్రజాస్వామ్యానికైనా ప్రజా విశ్వాసమే గీటురాయి’ అని తెలిపారు. ఈ సర్వేలో మొదటి స్థానాన్ని స్విట్జర్లాండ్, రెండోస్థానాన్ని ఇండోనేషియా సంతరించుకున్నాయి. ప్రజా విశ్వాసం విషయంలో అట్టడుగు స్థానంలోవున్న దేశాల్లో చిలీ, ఫిన్లాండ్, గ్రీస్, స్లోవేనియాలు ఉన్నాయి.