జాతీయ వార్తలు

మళ్లీ పాక్ కుయుక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: పాకిస్తాన్ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే కార్యక్రమాలు ప్రారంభించింది. ముంబాయి ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి హఫీజ్ సరుూద్‌ను గృహ నిర్బంధం నుండి విడుదలు చేయాలని నిర్ణయించిన పాకిస్తాన్ పాలకులు జమ్ముకాశ్మీర్ వివాదంపై మరోసారి అంతర్జాతీయ కోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి విలేఖరులతో మాట్లాడుతూ వైద్య పరీక్షలకోసం భారత దేశానికి వెళ్లే పాకిస్తానీయులకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చేస్తున్న సహాయం పెద్ద జిమ్మిక్కు అని విమర్శించారు. హఫీజ్ సరుూద్ గృహ నిర్బంధం నుండి విడుదలైన తరువాత భారత వ్యతిరేక మెగా ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించేందుకు కూడా పాకిస్తాన్ పాలకులు పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. పాకిస్తాన్ తాజాగా చేస్తున్న రెచ్చగొట్టే చర్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ముంబాయి ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి, జమాత్ ఉద్ దవా అధ్యక్షుడు
హఫీజ్ సరుూద్‌ను గృహ నిర్బంధం నుండి విడుదల చేయాలని నిర్ణయించటం ద్వారా పాకిస్తాన్ తన నిజ స్వరూపాన్ని బైటపెట్టిందని భారత దేశం మండిపడింది. ముంబాయిపై ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడి జరిగిన నవంబర్ 26 తేదీకి మూడు రోజుల ముందు హఫీజ్ సరుూద్‌ను విడుదల చేయటంద్వారా పాకిస్తాన్ ఉగ్రవాదానికి బహిరంగ మద్దతు ప్రకటించిందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రావీష్‌కుమార్ గురువారం విలేఖరుల సమావేశంలో ఆరోపించారు. గృహ నిర్భంధంలో ఉన్న హఫీజ్ సరుూద్‌ను విడుదల చేయటంద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందని రావీష్‌కుమార్ చెప్పారు. ముంబయి ఉగ్రదాడి సూత్రదారులను శిక్షించి దాడిలో మరణించిన వారికి న్యాయం చేయాలనే ఆలోచన పాకిస్తాన్‌కు లేదనేది మరోసారి స్పష్టమైందని ఆయన చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందనేందుకు సరుూద్ విడుదల తాజా ఉదాహరణ అని ఆయన చెప్పారు. ముంబయి ఉగ్రవాదికి తానే ప్రధాన సూత్రధారినని ఒప్పుకున్న హఫీజ్ సరుూద్‌ను విడుదల చేయాలని పాకిస్తాన్ నిర్ణయించటం అత్యంత దౌర్భాగ్యం, హేమమైన చర్య అని ఆయన చెప్పారు.
2008లో ముంబాయిలో ఇస్లామిక్ ఉగ్రవాదులు చేసిన దాడి కుట్రకు హఫీజ్ సరుూద్ ప్రధాన సూత్రధారి అనేది అందరికి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు రెండు వందల మంది మరణిస్తే వందలాది మంది గాయపడ్డారు. పదిమంది ఇస్లామిక్ ఉగ్రవాదులు 2008 నవంబర్ 26 తేదీ సముద్ర మార్గంలో వచ్చి రెండు ప్రఖ్యాత హోటళ్లు, రైల్వే స్టేషన్‌పై దాడి చేశారు. ఈ దాడులకు ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ సరుూద్‌ను ఐక్య రాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించటం తెలిసిందే. అమెరికా తెచ్చిన ఒత్తిడికి లొంగిన పాకిస్తాన్ ఈ సంవత్సరం జనవరి 31నడు సరుూద్‌తోపాటు మరో నలుగురు ఉగ్రవాద నాయకులను గృహ నిర్బంధంలో ఉంచింది. అయితే లాహోర్ హైకోర్టు ఏర్పాటు చేసిన బోర్డు హఫీజ్ సరుూద్‌ను విడుదల చేయాలని ఆదేశించింది. పంజాబ్ ప్రభుత్వం సరైన సాక్ష్యాలు చూపించలేకపోయిందని, అందుకే సరుూద్‌ను విడుదల చేయాలని ఆదేశిస్తున్నట్లు బోర్డు తమ తీర్పులో పేర్కొన్నది.

చిత్రం..హఫీజ్ సయాద్